'భాయ్' లో బ్రహ్మానందం పాత్ర ఇదే

By Srikanya

హైదరాబాద్ : ఎంటర్టైన్మెంట్ కు పర్యాయపదంగా మారిన బ్రహ్మానందం ఉంటే సినిమా హిట్ అని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో బ్రహ్మానందం లేనిదే ఇప్పుడు పెద్ద సినిమాలు ఉండటంలేదు. ఇప్పుడు అదే వరసంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన 'భాయ్' లోనూ కీలకమైన పాత్ర చేసినట్లు సమాచారం.మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం ఎన్నారైగా కనిపించి నవ్వించనున్నారు. నాగార్జునకి, బ్రహ్మానందంకు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.

ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే మొన్న ఆదివారం (అక్టోబర్ 5) ఈ చిత్రం ఆడియో విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజన నోట్ తో సీమాంధ్రలో బంద్ కు పిలుపు ఇవ్వటంతో నాగార్జున ఈ ఈవెంట్ ని ఆపుచేసారు. కొత్త ఆడియో విడుదల తేదీ అక్టోబర్ 11 అని నిర్ణయించినట్లు సమాచారం. అన్నపూర్ణ ఏడెకరాలు లో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ ఆడియో లాంచ్ ని చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు బిట్ సాంగ్స్ ని విడుదల చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 'హైదరాబాద్‌కి రెండే ఫేమస్‌. ఒకటి ఛాయ్‌. రెండోది భాయ్‌' అంటూ వస్తున్నారు నాగార్జున. ఈ భాయ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమా కోసం స్లొవేనియాలో 700ఏళ్ల చరిత్ర ఉన్న ప్రెడ్జమా అనే కోటలో పాటను చిత్రించారు. దీని గురించి నాగార్జున చెబుతూ ''పురాతనమైన కోట అయినా ఎంతో కొత్తగా ఉందది. ప్రేక్షకులకు విదేశీ అందాలను పరిచయం చేయడానికే ఇలాంటి ప్రత్యేకమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నాము''అన్నారు. ఇందులో నాగ్‌ సరసన రిచా గంగోపాధ్యాయ నటిస్తోంది. వీరభద్రమ్‌ చౌదరి దర్శకుడు.

దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ "ఆడియో చాలా బాగా వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ కూడా టెర్రిఫిక్‌గా ఇచ్చారు. ఇదివరకు విడుదల చేసిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. భిన్నమైన ఛాయలున్న పాత్రలో నాగార్జునగారు విజృంభించి నటించారు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. కచ్చితంగా నాకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది'' అని చెప్పారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లిమిటెడ్ సమర్పణలో నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరభద్రమ్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తోంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. నథాలియా కౌర్, కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, జరా షా, బ్రహ్మానందం, సోనూ సూద్, ఆశిశ్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆదిత్య మీనన్, సుప్రీత్, అజయ్, ఎమ్మెస్ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X