జెడీ చక్రవర్తికి బ్రహ్మానందం వార్నింగ్!?
జెడీ చక్రవర్తికి మనీ మనీ మోర్ మనీ చిత్రం మీడియో మీట్ లో బ్రహ్మానందం వార్నింగ్ ఇచ్చాడని ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానకి కారణం అక్కడ జరిగిన తతంగమే.బ్రహ్మానందం గురించి స్టేజిపై చాలా లేటు గా వస్తాడని, యూనిట్ ని ఇబ్బంది పెడతాడని అంటూ ఉండటం విన్నానని, అయితే అది నిజం కాదని అర్దమైందని తెలివిగా బ్రహ్మానందం గురించి బయిటపెట్టే ప్రయత్నం చేసాడు జెడి.
అయితే ఎంత నిజాలైనా తన ఎదురుగా చెప్పటం తట్టుకోలని బ్రహ్మానందం వెంటనే మైకు అందుకుని జెడీ చక్రవర్తి ఓ డీవిడి ఇచ్చి అందులో క్యారెక్టర్ ఉన్నదున్నట్లు చెయ్యమన్నాడని చెప్పటం మొదలెట్టాడు.దాంతో కంగారుపడ్డ జెడీ వెంటనే చెవిలో ఏదో ఊది అప్పటికి శాంతింప చేసాడు.ఆ తర్వాత పంక్షన్ అయ్యేవరకూ బ్రహ్మానందం వెనకే ఉంటూ ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు.అయితే బ్రహ్మానందం మాత్రం తన జోలికి మాత్రం రావద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని టాక్.


Click it and Unblock the Notifications











