twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందం డైరక్ట్ చేస్తున్న'జఫ్ఫా' కధేంటి?

    By Srikanya
    |

    స్టార్ కమిడెయిన్ బ్రహ్మానందం దర్శకుడుగా మారి జప్పా టైటిల్ తో ఓ తెలుగు చిత్రం డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం జఫ్పా ఖాన్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. ఇండియన్ పోలీసులుకు చిక్కిన పాకిస్ధాన్ టెర్రరిస్ట్ జఫ్ఫా ఖాన్. ఇండియన్ జైలు నుంచి అతను ఎలా తప్పించుకున్నాడనేది కథలో కీలకాంశంగా ఉంటుంది. అలాగే అతని పోలికలతోనే ఉన్న మరో అమాయిక బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని బయిటపడాలనుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కామిడీతో జరిగే కథనం. అలాగే బ్రహ్మానందం తన ఒరిజనల్ తెల్ల గెడ్డంతో జఫ్ఫా ఖాన్ పాత్రలో కనపిస్తారు.

    ఈ చిత్రం హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. ఇక టాకీ పార్ట్ పూర్తయ్యాక భారీగా ఈ చిత్రం డిటేల్స్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక ఢీ చిత్రం నుంచి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బ్రహ్మానందం ఇప్పుడు హీరోలతో సమానంగా సినిమాల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన మహేష్ దూకుడులోనూ బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ రోల్ ని చేసారు. ఇక తను డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం విజయవతం అయితే కంటిన్యూగా బ్రహ్మానందం చిత్రాలు డైరక్ట్ చేస్తారేమో చూడాలి.

    English summary
    Brahmanandam is directing the script penned by another comedian 'Vennela' Kishore. And interestingly, the movie is titled - Jaffa. Yes, you read it right, it is Jaffa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X