లూజ్ టాక్ కు సమంతకు కాలదా మరి...
హైదరాబాద్: హీరోయిన్స్ వేరే రాష్ట్రం నుంచి వస్తారు..వారికి ఇక్కడ మాటలు కొన్ని అర్దం కావు అన్న ధోరణిలో సెట్స్ లోనూ,బయిట కొన్ని మాటలు మాట్లాడుతూంటారు. అయితే ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్న హీరోయిన్స్ కు తెలుగు మాట్లాడకపోయినా అర్దమవుతుంది...అలాగే...ఇక్కడ స్నేహితులు ఉంటారనే సంగతి మర్చిపోతూంటాయి. దీనికి తోడు సరదాగా లూజ్ టాక్ గా అన్న మాటలు సైతం వారిని భాధిస్తాయి. తాజాగా అల్లుడు శ్రీను పంక్షన్ లో బ్రహ్మానందం అన్నమాటలు..సమంతకు అర్దమై చిరాకుపెట్టాయని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
బ్రహ్మానందం స్టేజిపై మాట్లాడుతూ... "ఈ సినిమాలో శ్రీనివాస్...సమంత ను నలిపేసాడు " అన్నారు. అది సినిమాలో హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రీని దృష్టిలో పెట్టుకుని అన్నా వేరే అర్దం వచ్చేలా ఉండటంతో ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చగా మారింది. ఇలా బ్రహ్మానందం అని ఉండకూడదు అంటున్నారు. లైట్ తీసుకోండి అని కొందరు అంటున్నా...కాదు నలిపేసాడు అనే పద ప్రయోగం కొంచెం తేడాగా ఉంది అని కోడి గుడ్డుకు ఈకలు లాగుతున్నారు. దానికి తోడు సమంత కూడా ఈ విషయమై కోపంగా ఉంది అంటున్నారు.

ఇక కామెడీ ఉన్న చిత్రాలే ప్రస్తుతం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతన్నాయు. దాంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హీరోలూ కామెడీనే నమ్ముకుని రంగంలోకి దిగుతున్నారు. ఇవన్నీ గమనించే తను లాంచ్ చేస్తున్న హీరో సినిమాని కూడా కామెడీతో నింపేసాడు వివి వినాయిక్. ఎందుకంటే సాధారణంగా ఓ హీరో తొలి చిత్రం వస్తోందంటే అంచనాలు బాగుంటాయి. అయితే అది హీరోల వారసులకే పరిమితం. నిర్మాత కుమారుడు హీరో అవుతున్నాడంటే సినిమా విషయం ఉంది అని తెలిస్తేనే థియోటర్ దగ్గర జనాలు ఉంటారు. అందుకే సేఫ్ బెట్ కోసం దర్శకుడు వివి వినాయిక్...కామెడీ తో తన తాజా చిత్రం నింపానని చెప్తున్నారు. దాన్ని చూపుతూనే బ్రహ్మానందంపై ట్రైలర్స్ వదలుతారని తెలుస్తోంది. బ్రహ్మానందం,సమంతని నమ్ముకున్నారని తెలుస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ దర్శకుడు. బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాత. బెల్లంకొండ సురేష్ సమర్పకులు. ఈ సినిమాకు 'అల్లుడుశీను' అనే పేరు ఖరారు చేసి, ఆడియోని విడుదల చేసారు. పూర్తి కామెడీతో చిత్రాన్ని తెరకెక్కించారని చెప్తున్నారు.
దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ '' హీరోగా అడుగుపెట్టే యువకుడికి సరైన సినిమా ఇది. ఓ హీరో నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. వీరి మధ్య 'అల్లుడుశీను' అనే పదం చాలా సార్లు వస్తుంది. అందుకే ఈ పేరు సినిమాకు ఖరారు చేశాం. హీోర, బ్రహ్మానందం పాత్రల మధ్య సాగే సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఆద్యంతం నవ్వులు పూయించేలా సినిమా ఉండబోతోంది. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది'' అన్నారు.
''నా కొడుకు సాయిశ్రీనివాస్‌ను పరిచయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు వినాయక్ ముందుకొచ్చాడు. అందరూ మెచ్చేలా నా కొడుకును తీర్చిదిద్దాడు. సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. వారందరి కృషి ఫలితం సినిమా బాగా వచ్చింది. వచ్చే నెల 24న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు బెల్లంకొండ సురేష్.


Click it and Unblock the Notifications











