twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మి హీరోగా ...'బ్యాంకాక్ లో బ్రహ్మానందం'

    By Srikanya
    |

    Brahmanandam
    హైదరాబాద్ బ్రహ్మానందం మరో చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. .'బ్యాంకాక్ లో బ్రహ్మానందం' టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తారు. మే మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. మరో ప్రక్క బ్రహ్మి హీరోగా చేసిన జఫ్ఫా చిత్రం సైతం విడుదలకు సిద్దమవుతోంది. వెన్నెల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

    హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'జఫ్ఫా'. విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం పూర్తి రైట్స్ ని రవితేజ 'వీర'దర్శకుడు రమేష్ వర్మ తీసుకుని నిర్మాత గా మారారని సమాచారం. ఆయనే ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ చూస్తున్నారు. తాజాగా సాయి మనాలి ఎంటర్టైన్మెంట్స్ వారికి ఈ చిత్రం ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. అలాగే బ్లూ స్కై సినిమా వారికి మిగిలిన ఓవర్ సీస్ రైట్స్ ని ఇచ్చారు.

    కథ పూర్తిగా జైల్లో జరగనుంది. కిరణ్‌ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై రమేష్‌వర్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ...''జైలు నేపథ్యంలో సాగే కథ ఇది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జఫ్ఫాగా బ్రహ్మానందం నటన ఆద్యంతం అలరిస్తుంది. నాలుగు పాటలున్నాయి. ఆ పాటల్లోనూ కావల్సినంత వినోదాన్ని మేళవించాం. సునీల్‌ కాశ్యప్‌ మంచి బాణీలను అందించారు'' అని తెలిపారు.

    ఈ చిత్రంలో బ్రహ్మానందం జఫ్పా ఖాన్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. ఇండియన్ పోలీసులుకు చిక్కిన పాకిస్ధాన్ టెర్రరిస్ట్ జఫ్ఫా ఖాన్. ఇండియన్ జైలు నుంచి అతను ఎలా తప్పించుకున్నాడనేది కథలో కీలకాంశంగా ఉంటుంది. అలాగే అతని పోలికలతోనే ఉన్న మరో అమాయిక బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని బయిటపడాలనుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కామిడీతో జరిగే కథనం. అలాగే బ్రహ్మానందం తన ఒరిజనల్ తెల్ల గెడ్డంతో జఫ్ఫా ఖాన్ పాత్రలో కనపిస్తారు.

    ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. మిగతా కీలక పాత్రల్లో రఘుబాబు, అలీ, వేణుమాధవ్‌, శ్రవణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: నవీన్‌.

    English summary
    Brahmanandam is again testing waters, acting as a hero in in a soon to be released JAFFA, directed by Vennela Kishore. Also he will don the hero's hat in a film titled Bangkok Brahmanandam. E Satti Babu will direct the film whose regular shoot will commence from May.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X