నితిన్ ని హీరోగా తీసేసి ఆ ప్లేసులో బ్రహ్మానందాన్ని....
తెలంగాణ మెగా స్టార్ గా పేరు తెచ్చుకున్న నితిన్ కి భలే కష్టమొచ్చింది. తాజాగా అతన్ని తీసేసి బ్రహ్మానందాన్ని పెట్టి హీరోగా సినిమా లాగించేస్తున్నారు. ఇంతకీ ఏం సినిమా అదీ అంటే..మనీ సినిమా సీక్వెల్. మనీ, మనీ మనీ చిత్రాలకు సీక్వెల్ గా రూపొందనున్న చిత్రం మనీ మనీ మోర్ మనీ జెడి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇటివల నిరాడంబరంగా ప్రారంభం అయ్యాయి. కాగా ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తున్నాడని మొదటి ప్రకటించారు జెడి. కాని ఇప్పుడు ఆ ప్లేస్ లో బ్రహ్మానందాన్ని పెట్టి ఆల్ మోస్ట్ బ్రహంమనందనే హీరోగా ట్రీట్ చేస్తూ జెడి ఆ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఓ ప్రముఖ హీరో కూడా గెస్ట్ గా నటించనున్నాడని సమాచారం. అయితే ఆ ప్రముఖ హీరో..జగపతి బాబు కూడా అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా ప్రక్కకు పోవటంతో నితిన్ కి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.


Click it and Unblock the Notifications











