'పంజా'లో బ్రహ్మానందం ఏంచేస్తాడంటే..
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజాలో బ్రహ్మానందంకీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్స్ లో సైతం అతని మీద చిత్రీకరించిన పాపారాయుడు పాటను హైలెట్ చేసారు. ఇంతకీ బ్రహ్మానందం పాత్ర సినిమాలో ఏమిటీ అంటే అతనో సోతస్ పోలీస్ ఆఫీసర్. విలన్ కొడుకుని చంపి తన గర్ల్ ప్రెండ్ ఊరు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ తన కుటుంబాన్ని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. అలాంటి సమయంలో బ్రహ్మానందం కనపడతాడు. అక్కడ అతనికి బ్యాడ్ రిప్యుటేషన్ ఉంటుంది. దాంతో అతన్ని అడ్డం పెట్టుకుని పవన్ విలన్స్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. పవన్ తనను బకరా చేసి వాడుకుంటున్నాడని(రెడీ తరహాలో)బ్రహ్మానందం అతను చేసిన మర్డర్స్ అన్నీ తనే చేసాననుకుని మురిసిపోతూంటాడు.
ఆ పాత్రలో బ్ర్హహ్మానందం హిలేరియస్ గా నవ్వించాడు.ఇక ఈ చిత్రంలో పవన్ జై దేవ్ అనే మాఫియా వ్యక్తిగా కనపిస్తాడు. విలన్ కొడుకుని చంపేసి తన గర్లెప్రెండ్ ఊరుకి వచ్చి తన కుటుంబాన్ని చంపిన వారిపై పగ తీర్చుకుంటూంటాడు. ఇక సినిమాలో ఝాన్సీ,బ్రహ్మానందం లేకపోతే సెకండాఫ్ లో ఏమీ లేనట్లే అంటున్నారు. టెక్నికల్ గా ఈ చిత్రం హాలీవుడ్ స్ధాయిలో ఉందని అంతటా వినపడుతోంది. స్టైలిష్ టేకింగ్ తో పవన్ ని ఓ రేంజిలో చూపాడని చెప్పుకుంటున్నారు. పాటలు సైతం సినిమాకు ప్లస్ గా మారాయి. ఇది పవన్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











