For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్ : 'సీతమ్మ వాకిట్లో ...' నుంచి బ్రహ్మానందం సీన్స్ కట్

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఈ సంక్రాంతికి వస్తున్న భారీ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌. మహేష్‌బాబు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో నుంచి బ్రహ్మానందం క్యారెక్టర్ కట్ చేసినట్లు సమాచారం. డ్యూరేషన్ సమస్యతో ఈ పాత్రను తీసేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందిన సమాచారం ప్రకారం...మొత్తం అవుట్ పుట్ 3 గంటల,40 వచ్చిందని చెప్తున్నారు. దాంతో దాన్ని రెండు గంటల 40 నిముషాలకు కుదించే ప్రాసెస్ లో బ్రహ్మానందం మీద వచ్చే సన్నివేశాలను ఎడిట్ చేసినట్లు సమాచారం. అయితే ఇది నిజమా కాదా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

  ఇక 'నేనంతే ఇలాగే ఉంటాన'నే మొండి అన్నయ్య... ఎవరినైనా మాటల్తోపడేసి తన దారిలోకి తెచ్చుకొనే చలాకీ తమ్ముడు.. అందరినీ ఒక్క తాటిపై నడిపే తండ్రి - ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా.. ప్రేమ పంచడంలో తక్కువ చేయని అమ్మ. ఓ ఇంట్లో ఎంత వైవిధ్యం ఉందో కదూ. వీరందరి అనుబంధాలకూ, ఆప్యాయతలకూ దృశ్య రూపమే.. మా చిత్రం అంటున్నారు దిల్‌ రాజు. ఆయన నిర్మించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'.సమంత కథానాయిక. అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ ఇది. మన జీవితాల్లోని అనుభూతులే తెరపై కనిపిస్తాయి. విడుదలపై కొంతమందికి కొన్ని అనుమానాలున్నాయి. ప్రకటించిన తేదీకి వస్తుందా? రాదా? అని అడుగుతున్నారు. అనుకొన్న విధంగా 11నే తీసుకొస్తున్నాం. ఆ రోజు అమావాస్య. కాబట్టి.. 10వ తేదీన ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. వాటి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తాను. చిత్రం నిడివి 2 గంటల 35 నిమిషాలుంటుంది. వెంకటేష్‌-అంజలి, మహేష్‌-సమంతల మధ్య నడిచే ప్రేమకథ యువతరానికి నచ్చుతుంది. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, నేపథ్య సంగీతం: మణిశర్మ.

  సమంత, అంజలి, ప్రకాష్‌రాజ్, జయసుధ, రోహిణిహట్టంగడి, రావు రమేష్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీజెమేయర్, కెమెరా: కె.వి.గుహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, నిర్మాత: దిల్‌రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

  English summary
  ‘Seethamma Vakitlo Sirimalle Chettu’ which was having total output with 3hr 40 min duration, the film makers has trimmed one hour which made the movie for 2hr 40min, in this trimming comedian Brahmanandam total character has been deleted by the film makers. The movie is starred by Mahesh Babu, Venkatesh, Samantha, Anjali, Brahmanandam, Prakash Raj, M.S.Narayana and others. The film is directed by Srikanth Addala and produced by Dil Raju. The music is scored by Mickey J Meyer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X