బ్రహ్మానందం రెండో కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడా? ఇన్నాళ్లు ఎక్కడున్నాడు
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దాదాపు మూడు తరాలలను తన కామెడీ టైమింగ్ కడుపుబ్బా నవ్వించిన ఆయన ఎప్పటికైనా కామెడీ కింగే.. ఇక ఇటీవల ఆయన ఆయన సినిమాలను తగ్గించడం తో కొన్ని రూమర్స్ వచ్చాయి. సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టె ఛాన్స్ ఉందని, సీరియల్స్ తో బిజీ కానున్నారని టాక్ రాగా అవన్నీ అబద్ధమని తేలింది. ఇక బ్రహ్మానందం చిన్న కుమారుడు సినిమాల్లోకి రానున్నట్లు కూడా టాక్ నడుస్తోంది.

అది తప్పితే మరో పని పెట్టుకోరు
అసలు బ్రహ్మానందం పర్సనల్ లైఫ్ గురించి జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. చాలా వరకు ఆయన పర్సనల్ లైఫ్ ను ప్రైవైసి గా ఉంచడానికి ఇష్టపడతారు. సినిమాలు, ఇల్లు, ఆర్ట్.. తప్పితే మరో పని పెట్టుకోరు. తన పని తాను చూసుకుంటూ చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉండే బ్రహ్మానందం అంటే అన్ని వర్గాల ఆడియేన్స్ ఎంతగానో ఇష్టపడతారు.

బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు
ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులున్నారనే విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియదు. పెద్ద కుమారుడు గౌతమ్ గురించి అందరికి తెలిసిందే. అతను మూడు సినిమాలు కూడా చేశాడు. అయితే చిన్న కుమారుడు మాత్రం బయట ఎక్కువగా కనిపించడు. చాలా వరకు జనాలు బ్రహ్మానందంకు గౌతమ్ ఒక్కడే కుమారుడు అనుకున్నాడు.

పెద్ద కుమారుడు హీరోగా..
పెద్ద కుమారుడు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అంతగా హిట్టవ్వలేదు. బసంతి, మను లాంటి డిఫరెంట్ సినిమాలు చేసి నటుడిగా మంచి గుర్తింపు అయితే అందుకున్నాడు గాని కమర్షియల్ గా హిట్స్ అందుకోలేదు.

చిన్న కుమారుడు ఇన్నాళ్లు ఎక్కడున్నాడు?
ఇక బ్రహ్మానందం రెండవ కుమారుడు నెక్స్ట్ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే సందేహాలు వసగున్నాయి. అతని పేరు సిద్దార్థ్. టీనేజ్ వయసు దాటగానే విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను పూర్తి చేసిన సిద్దార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు అతను ప్రైవసీ లైఫ్ ను ఇష్టపడతారని తెలుస్తోంది.
Recommended Video

సినిమాల్లోకి వస్తాడా?
ఇక మొత్తానికి ఇండియాకు వచ్చిన సిద్దార్థ్ బ్రహ్మానందం కోరిక మేరకు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరో టాక్ ప్రకారం సిద్దార్థ్ కు సినిమాలకన్నా కూడా బిజినెస్ వైవు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ సపోర్ట్ తో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక సినిమాల్లోకి వస్తాడా రాడా అనేది కేవలం ఉహగణమే. మరి బ్రహ్మానందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











