twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ బ్రహ్మానందం షాకింగ్ డిసిషన్.. సినిమాలను రిజెక్ట్ చేస్తూ.. మరో దారిలో..

    |

    హాస్యబ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన కమెడియన్ బ్రహ్మానందం. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషజ్ క్రేజ్ ని అందించేవారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. అందుకు కారణం ఆయన ఒక కొత్త నిర్ణయం తీసికున్నారట. ఆఫర్స్ వస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తున్నారట.

    సినిమాల్లో కనిపించకపోయినా..

    సినిమాల్లో కనిపించకపోయినా..

    బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పాలి. ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా కూడా నేటితరం జనరేషన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ లలో సగానికి పైగా బ్రహ్మానందం స్టైల్ లోనే ఉంటాయి. ఆయన లేకుంటే మీమ్స్ ఈ రేంజ్ లో వచ్చేవా అని ఒక టాక్ కూడా వైరల్ అయ్యింది.

     ఆరు పదుల వయసులో కూడా..

    ఆరు పదుల వయసులో కూడా..

    ఇకపోతే గత రెండేళ్లకు ముందు వరకు కూడా బ్రహ్మానందం చాలా బిజీగా ఉండేవారు. ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా కనిపించేవారు. వెయ్యి సినిమాలకు పైగా చేసిన ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న కమెడియన్స్ డిఫరెంట్ గా ఉండడంతో పాటు కమర్షియల్ కామెడీయన్స్ కి అవకాశాలు తగ్గాయి. అందుకే బ్రహ్మానందంకి సరైన అవకాశాలు రావడం లేదు.

     కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా..

    కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా..

    అవకాశాలు తగ్గుతున్నాయనే విషయం బ్రహ్మానందంకి బాగా అర్ధమయ్యింది. అందుకే చిన్న చిన్న సినిమాల్ని చేయడం కూడా మానేశారు. ఇక నెక్స్ట్ సీరియల్స్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి. రెగ్యులర్ గా ఉండే సీరియల్స్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశం వస్తే నటించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Brahmanandam Hails Allu Arjun & Trivikram At Ala Vaikunthapurramuloo Success Meet
    ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని..

    ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని..

    ఒకప్పుడు రోజుకు లక్ష రూపాయల పెమెంట్ తీసుకున్న బ్రహ్మానందం ఆ తరువాత రెమ్యునరేషన్ డోస్ తగ్గించినప్పటికి సరైన అవకాశాలు రాలేదు. ఓ వ్వర్గం దర్శకులు అప్పట్లో బ్రహ్మానందం లేకపోతే సినిమాలు తీసేవారు కాదు. అనంతరం వారు కూడా కొత్త కమెడియన్స్ పై ఇంట్రెస్ట్ చూపడంతో బ్రహ్మానందంకి సరైన క్రేజ్ రాలేదు. ఇక నెక్స్ట్ సిరియల్స్ ద్వారా బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరవ్వాలని ఒక డైలీ సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

    English summary
    Brahmanandam is an actor who has made a special mark in Tollywood, no matter how many comedians. The senior comedian, who has received a variety of tags as a comedic Brahman as King Comedian, does not go into great detail. Quite silent he would do his job. But there is a talk in the industry that he is very strict when it comes to money. In a recent interview, he clarified those issues
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X