twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొడుకు సినిమాపై సీరియస్ అవుతున్న బ్రహ్మానందం

    By Srikanya
    |

    హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా రీఎంట్రీ ఇస్తూ చేసిన వారెవా చిత్రం దర్శకుడుని ఎప్పుడో తీసేసి నిర్మాతే సినిమాని చుట్టేసాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు బ్రహ్మానందం చాలా సీరియస్ అయ్యారని, ఆయన నటించవలిసిన సీన్స్ పెండింగ్ ఉంచారని, రాజీకి వెళితే కొన్ని సీన్స్ రీషూట్ చేస్తేనే ఒప్పుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి దర్శకుడుగా కళ్యాణ్ మంతెన పని చేసారు. ఆ తర్వాత నిర్మాతకీ, దర్శకుడుకీ విభేదాలు వచ్చి నిర్మాత మహేశ్వరావే దర్శకుడు అవతారం ఎత్తారని చెప్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఈ విషయం బయిటకు పొక్కటంతో ఈ చిత్రం కొనుగోలు చేయటానకి ఎవరూ ముందుకురావటం లేదని చెప్తున్నారు. మరో ప్రక్క బ్రహ్మానందం మాత్రం తన కొడుక్కి ఈ చిత్రం నిమిత్తం రావల్సిన మిగతా పేమెంట్ కోసం రోజూ వెంటాడుతున్నాడని చెప్తున్నారు.సినిమా ప్రారంభైన నాటినుండీ ఏ దశలోనూ క్రేజ్ సంపాదించుకోలేక పోయిన ఈ చిత్రాన్ని బయిట పడేసే భాద్యత బ్రహ్మానందం తీసుకుంటేనే బెస్ట్ అంటున్నారు. శాంభవి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రం 'కాలేజి నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్ ‌టైనర్‌ అని, గౌతమ్‌ పాత్ర సరదాగా సాగిపోతూ అందర్నీ ఆకట్టుకుంటుంది' అంటున్నారు. ఇక గౌతమ్ చేసిన తొలి చిత్రం పల్లకీలో పెళ్ళికూతురు భాక్సాఫీస్ వద్ద ఫెయిలయిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X