బ్రహ్మానందాన్ని'బ్రహ్మదేవుడు'చేసిన పూరీ

By Srikanya

త్వరలో బ్ర్హహ్మానందం వెండితెరపై బ్రహ్మానందంగా కనపించనున్నారు. ఆయన భార్య సరస్వతి దేవిగా కోవై సరళ కనిపించనుంది. వీరిద్దరి జంట పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనష్యులలో అలరించనుంది. గతంలో పూరి జగన్నాధ్ చిత్రం పోకిరిలో బ్రహ్మి సాప్ట్ వేరే ఇంజినీర్ గా అదరకొట్టిన బ్ర్హహ్మానందం ఈ సారి... బ్రహ్మదేవుడుగానూ బాగా నవ్విస్తాడంటున్నారు. తన భార్యను వెతుక్కుంటూ భూమి మీదకు వస్తాడు ఈ బ్రహ్మదేవుడు అని చెప్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో బ్రహ్మదేవుడు కథ చెప్తూంటే దానికి తగినట్లుగా సీన్స్ జరుగుతూంటాయి. ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ... దేవుడు ఎంతో మంచివాడు. అందుకే చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు ఎంతమంది? కర్త, కర్మ, క్రియ... అన్నీ మనమే అయినా ఆ పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు సమాజానికి ఏం చెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంన్నారు.

దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.

రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం...పూరీ జగన్నాధ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X