twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నయనతారకు లైన్ చేస్తున్న బ్రహ్మానందం

    By Srikanya
    |

    రెడీ, ఢీ వంటి చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ కమిడియన్ గా ఎదిగిన బ్రహ్మానందం తాజాగా నయనతారకు లైన్ వేస్తూ నవ్వించనున్నారు. వివి వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రెడీ అయిన అదుర్స్ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర పురోహితుడు పాత్ర. అతను దగ్గర ఎన్టీఆర్ అసెస్టింట్. నయనతారకు బ్రహ్మానందం లైన్ వేస్తూంటాడు. పోకిరిలో ఇలియానాకులైన్ వేసినట్లుగా సీరియస్ గా ట్రై చేసి నవ్విస్తూంటాడు. ఆమె మాత్రం ఆల్రెడీ ఎన్టీఆర్ కు పడిపోయి ఆ విషయం దాచి బ్రహ్మానందం చేత పనులు చేయించుకుంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్వి పాత్రలలో కనిపిస్తారు. కొడాలి నాని,వంశీ నిర్మాతలుగా చేసిన ఈ చిత్రం క్రిసమస్ కానుకగా రిలీజ్ అవుతోంది.

    అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా నయనతార, షీలా అతనికి జోడీగా కనిపించనున్నారు. వీటికి తోడు భిళ్లా తో తొలిసారిగా బికినీ వేసిన నయనతార ఈ చిత్రంలోనూ మరోసారి బికినీలో కనిపించి కనువిందు చేయనుంది. ఇవే కాక అందాల భామ ఛార్మీ ఓ ఐటం సాంగ్ లో తన అందచందాలు ఒలకపోయనుంది. ఈ చిత్రంకోసం లవకుశ, అదుర్స్, వాడే వీడు టైటిల్స్ ను ఎన్నుకున్నారు. చివరకు అదుర్స్ ఫైనలైజ్ చేసారు. రెండు పాత్రల్లో ఒకటి భ్రాహ్మణ పాత్ర,మరొకటి డాన్ పాత్ర అని తెలుస్తోంది.

    సెకెండాఫ్ లో ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళ్లినప్పుడు వచ్చే కామిడీ హిలేరియస్ గా ఉంటుందని చెప్తున్నారు.ఈ చిత్రానికి వివివినాయిక్ దర్శకత్వం వహిస్తే కోనవెంకట్ కథ-మాటలు అందించారు. అలాగే ఈ చిత్రం పూర్తి స్టాయి కామిడీ ఎంటర్టైనర్. దేవీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో మహేష్ ముంజ్రేకర్ విలన్ గా చేసారు. మహేష్ ముంజ్రేకర్ గతంలో గోపీచంద్ ఒక్కడున్నాడు చిత్రంలో విలన్ గా చేయటం తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X