»   » బ్రహ్మానందానికి ‘దూకుడు’ అవమాన భారం

బ్రహ్మానందానికి ‘దూకుడు’ అవమాన భారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నటి‌తరం నుటుల నుంచి...నేటి తరం నటుల వరకు అందరితో ఇమిడి పోతూ స్టార్ కమెడియన్‌గా ఎదిగారు బ్రహ్మానందం. అందుకే ఆయన ఎక్కడి వెళ్లినా బహ్మరథం పడతారు అగ్రహీరోలు దర్శక, నిర్మాతలు. అయితే దూకుడు ఆడియో వేడుకలో జరిగింది వేరు. దీంతో అవమానంగా ఫీలవుతున్నాడట ఈ సూపర్ కమెడియన్.

ఇందుకు ప్రధాన కారణం ఈ కార్య్రకమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ ఝాన్సీ అనే వాదన వినిపిస్తోంది. బ్రహ్మానందం విషయాన్ని కాసేపు పక్కన పెడితే.... సినిమా హీరోయిన్ సమంతను వేదికపైకి ఆహ్వానించే సమయంలో ఆమెను సమంత అనబోయి తమన్నా అంటూ సంబోధించి టంగ్ స్లప్పయింది ఝన్సీ. దీంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే తన తప్పును గమనించిన ఝన్సీ పొరపాటును సరిదిద్దుకుంది.

ఆ తర్వాత పలువురు ప్రముఖులను, మిగతా కమెడియన్లను వేధికపైకి ఆహ్వానించే కార్య్రకమం జరిగింది. అయితే స్టార్ కమెడియన్ బ్రహ్మానందాన్ని తొలుత పిలవాల్సింది పోయి....బ్రహ్మానందం కంటే 'బచ్చా"లను ముందు వేదికపైకి ఆహ్వానించడం జరింది. దీన్ని చాలా అవమానంగా భావిస్తున్నాడట బ్రహ్మి. దూకుడు ఆడియో వేడుకలోనే తనకు జరిగిన అవమానంపై ఆక్రోశం వెల్లగక్కుదామని అనుకున్నాడట గానీ....మహేష్ బాబు, శ్రీను వైట్ల ఫీలవుతారని సైలెంట్ అయిపోయాడట.

బయటకు వచ్చాక తనకు జరిగిన అవమానంపై...సన్నిహితులతో చెప్పుతూ చిటపటలాడినట్లు తెలిసింది. దీనికి కారణం ఝాన్సీనా? లేక కార్య్రక్రమ నిర్వాహకులా? ఎవరో నాకు తెలియాలి? నా పవరేంటో చూపిస్తా అంటూ రంకెలేసినట్లు సమాచారం.

English summary
The organizers have done something similar to this star comedian. For every such function, Brahmi will be called on-stage to utter a few words about the flick as he is a huge attention grabber. However, team Dookudu has delayed calling Brahmi on to the stage. Adding fuel to the fire, they have invited Brahmi on to the stage after calling all ‘bachhas’ and this has hurt the comedy king.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu