‘ఆగడు’ ఎఫెక్ట్: నిర్మాతల మధ్య చీలిక?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన నిర్మాతల మధ్య చీలిక ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. నమో వెంకటేశ నుండి మొదలై దూకుడు, 1 నేనొక్కడ్నే, లెజెండ్, ఆగడు వరకు వీరి ప్రయాణం సాగింది.
అయితే...‘ఆగడు' సినిమా సమయంలో ఏర్పడ్డ విబేధాలు నిర్మాతల మధ్య చీలికకు కారణమైంది, తన స్నేహితులైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటల నుండి వేరుపడి అనిల్ సుంకర వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే విబేధాలకు కారణం ఏమిటనేది తెలియరాలేదు.

సునీల్ హీరోగా అనిల్ సుంకర సినిమా...
అనిల్ సుంకర త్వరలో నిర్మించబోయే సినిమా ద్వారా ప్రముఖ స్క్రీన్ ప్లే రైటర్ గోపీ మోహన్ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఢీ, రెడీ, దుబాయ్ శీను, సంతోషం, వెంకీ, కింగ్, నమో వెంకటేశ తదితర హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన గోపీ మోహన్ సునీల్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఇక అన్నదమ్ములైన రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











