ఎన్టీఆర్ దర్శకుడు రామ్ చరణ్ ని డైరక్ట్ చేస్తున్నాడు
ఎన్టీఆర్ తో బృందావనం చిత్రం రూపొందించిన వంశీ పైడిపల్లికి రామ్ చరణ్ ని డైరక్ట్ చేసే అవకాశం వచ్చింది.రీసెంట్ గా వంశీ..రామ్ చరణ్ ని కలసి స్టోరీ లైన్ ని నేరేట్ చేసాడని, అది నచ్చిన రామ్ చరణ్ ప్రొసీడ్ అవ్వమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక తాను..బృందావనం చూసి ఇంప్రెస్ అయ్యానని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత అయ్యే అవకాశం ఉంది. వంశీ మొదటి చిత్రం మున్నా, ఆ తర్వాత చిత్రం బృందావనం రెండింటిని దిల్ రాజే నిర్మించారు. ఇక వంశీ..స్క్రిప్టుని ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇక మరో ప్రక్క రామ్ చరణ్, ధరణి దర్శకత్వంలో మెరుపు చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం పక్కా మాస్ మశాలా కధతో రెడీ అవుతోందని సమాచారం. అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో త్వరలో ప్రజారాజ్యం పార్టీ మెంబర్ గంటా శ్రీనివాస రావు నిర్మించే చిత్రం కూడా మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











