ఎన్టీఆర్ 'బృందావనం' పై కుళ్లు ఎస్.ఎమ్.ఎస్ జోక్
రేపు రిలీజ్ కానున్న ఎన్టీఆర్ బృందావనం చిత్రంపై ఓ ఎస్.ఎమ్.ఎస్ జోక్ అంతటా ప్రచారమవుతోంది.ఫిల్మ్ సర్కిల్స్ లో ఎక్కడ విన్నా ఆ జోక్ టాపిక్కే వినపడుతోంది. ఆ జోక్ ఇట్లా ఉంది.
పవన్ కళ్యాణ్ : మహేష్ నా 'పులి' పోయింది. నీ 'ఖలేజా' పోయింది. పద ఇద్దరం బార్ కి వెళ్ళి బాధలు మర్చిపోదాం. మహేష్ : ఎందుకు అన్నయ్యా తొందర..ఒక్క రోజు ఆగితే ఎన్టీఆర్ కూడ వస్తాడు. ముగ్గురం కలసి మర్చిపోదాం భాధలు..
అని 'బృందావనం' పై విసుర్లుతో ఈ ఎస్.ఎమ్.ఎస్ క్రియేట్ చేసారు.నిజానికి ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిందేమీ కాదు. బయిట బృందావనం చిత్రంపై మంచి హోప్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులే కాక అందరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దిల్ రాజు చెప్తున్నారు.
జూ ఎన్టీఆర్ పులి పవన్ మహేష్ ఖలేజా బృందావనం దిల్ రాజు jr ntr puli pawan kalyan mahesh babu khaleja dil raju


Click it and Unblock the Notifications