మెగా మల్టీస్టారర్‌కు ఇంగ్లీష్ టైటిల్.. పవన్‌ను సాయి తేజ్ అలా పిలుస్తాడా? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా!
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా పరిచయం అవడమే కాదు.. అందులో చాలా మంది స్టార్లుగా హవాను చూపిస్తున్నారు. ఇక, ఈ ఫ్యామిలీ హీరోల నుంచి మల్టీస్టారర్ మూవీలు రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వాళ్ల ఆశలను నిజం చేస్తూ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో సినిమా రాబోతుంది. తాజాగా దీని టైటిల్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!
మెగా హీరోల మల్టీస్టారర్:మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో 'వినోదయ సీతమ్' మూవీ రీమేక్ అవుతోన్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌కు చెందిన నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అక్కడ అదిరిపోయే స్పందన రావడంతో ఇప్పుడు దీన్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నారు.

వాళ్లందరి కాంబినేషన్:పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రాబోతున్న ఈ చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.
స్పీడుగా.. పవన్ కంప్లీట్:మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్‌ను ఫిబ్రవరి నెలఖరున మొదలు పెట్టారు. అంతేకాదు, ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పార్టును కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపుగా పూర్తవడానికి వచ్చింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయడానికి ప్లాన్లు చేసుకుంటోన్నారు.

టైటిల్ గురించి వార్తలు:క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే 'దేవర', 'దేవుడే దిగి వచ్చినా' సహా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అంతేకాదు, మెగా అభిమానులు వీటిని ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్ కూడా చేశారు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈ టైటిళ్లపై స్పందించనేలేదు.

ఇంగ్లీష్ పేరునే కన్ఫార్మ్:పవన్ కల్యాణ్.. సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రానికి తాజాగా 'బ్రో' (BRO) అనే ఇంగ్లీష్ టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారట. ఇప్పటికే నిర్మాతలు దీన్ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని తెలిసింది. ఇక, ఈ టైటిల్ పోస్టర్‌ను మే మూడో వారంలో లేదా చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఫ్యాన్స్ ఒప్పుకుంటారా:తాజాగా బయటకు వచ్చిన 'బ్రో' (BRO) టైటిల్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతోన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్‌ను సాయి ధరమ్ తేజ్ బ్రో అని పిలుస్తాడని, అందుకే ఈ టైటిల్ పెట్టబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, ఈ పేరుపై మెగా అభిమానులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తోన్నారు.

దేవుడు, భక్తుడిగా చేస్తూ:ఈ చిత్రంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ దేవతల అనుగ్రహంతో 60 రోజుల పాటు భూలోకానికి తిరిగి వచ్చేందుకు పర్మీషన్ పొందుతాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ. ఇందులో దేవుడి పాత్రలో పవన్ కల్యాణ్.. ఆ బాధితుడిగా సాయి ధరమ్ తేజ్‌లు నటిస్తున్నట్లు ఇప్పటికే చెప్పుకున్నాం.


Click it and Unblock the Notifications











