For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ ఆఫర్ వాడుకోలేకపోయిన డైరెక్టర్.. ఇక ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్లే!

  |

  పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. నటుడిగా తనలోని సత్తాను నిరూపించుకుని సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం తారక్ వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను అందుకోవడంతో పాటు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు.

  అతి దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: ఏమీ దాచుకోకుండానే హాట్ షో

  వరుస హిట్లతో సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో ఇంకా ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉండగా.. తారక్ దీని తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. ఈ క్రమంలోనే అతడు 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతోనూ ఓ ప్రాజెక్టు చేస్తాడనే టాక్ వచ్చింది.

  Buchi Babu Sana Did Not Satisfied Jr NTR

  ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించే ప్రాజెక్టు స్పోర్ట్స్ బేస్ స్క్రిప్టుతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు కోసం బుచ్చిబాబు గతంలోనే ఎన్టీఆర్‌కు స్టోరీని వినిపించాడు. కానీ, అందులో అతడు మార్పులు చెప్పాడట. అలా పలుమార్లు ఛాన్స్ ఇచ్చినా బుచ్చిబాబు మాత్రం తారక్‌ను ఇంప్రెస్ చేయలేకపోయాడని తెలిసింది. దీంతో ఈ స్టార్ హీరో ఈ సినిమాను చేయనని చెప్పినట్లు తాజాగా ఓ న్యూస్ తెలిసింది.

  ఆ హీరోపై యాంకర్ విష్ణుప్రియ దారుణ కామెంట్స్: 'చూస్తే నలిపేయడమే' అంటూ మేటర్ లీక్ చేయడంతో!

  Buchi Babu Sana Did Not Satisfied Jr NTR

  జూనియర్ ఎన్టీఆర్ తన కథను రిజెక్ట్ చేయడంతో బుచ్చిబాబు సన వేరే హీరోలను కూడా సంప్రదిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అతడు ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కూడా ఈ స్క్రిప్టును వినిపించాడనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  English summary
  Jr NTR and Buchi Babu Sana Movie Goes Hot Topic From Very Long Time. Latest Reports Says.. This Director Did Not Satisfied The Hero.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X