రెండో సినిమాకే కోట్లలో రెమ్యునరేషన్.. బుచ్చి బాబు లెక్కే వేరు !

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. ఈ సినిమా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. సుకుమార్ శిష్యుడు గా ఎంట్రీ ఇచ్చినా సరే బుచ్చిబాబు తనదైన శైలిలో సినిమా మొత్తాన్ని నడిపించాడు. ఈ సినిమాకు గాను వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరికీ మంచి గుర్తింపు లభించగా వీరిద్దరి కంటే మంచి గుర్తింపు దర్శకుడు బుచ్చిబాబుకు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా చేసిన బ్యానర్ లోనే రెండో సినిమా కూడా చేయాల్సిందిగా నిర్మాతలు కోరినట్లు సమాచారం..

రెండో సినిమాతోనే పది కోట్ల రూపాయలు

రెండో సినిమాతోనే పది కోట్ల రూపాయలు

ఉప్పెన సినిమా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సదరు నిర్మాణ సంస్థ కి భారీ ఎత్తున లాభాలు ఆర్జించి పెట్టింది. దీంతో రెండో సినిమా కోసం బుచ్చిబాబుకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు రెండో సినిమా కోసం బుచ్చిబాబు కోసం ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.. దానికి జీఎస్టీ అదనం. దీంతో రెండో సినిమాతోనే సుమారు పది కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ బుచ్చిబాబు ఒక రికార్డు సృష్టించాడు అనే ప్రచారం జరుగుతోంది.

 రెమ్యూనరేషన్ కావడంతో బెంజ్ కార్

రెమ్యూనరేషన్ కావడంతో బెంజ్ కార్

నిజానికి మొదటి సినిమా ఉప్పెనకి బుచ్చిబాబు రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంది. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో నిర్మాతలు దర్శకుడికి ఒక బెంజ్ కారు కూడా గిఫ్ట్ గా అందించారు.. దాని విలువ సుమారు 75 లక్షల దాకా ఉంటుందని అంచనా. మొత్తం మీద బుచ్చిబాబులో హిట్ సినిమాలు తెరకెక్కించే టాలెంట్ ఉండటంతో ఆయనను వదులుకోవడం ఇష్టం లేక ఆయనకు భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలా మొత్తం మీద రెండో సినిమాకి పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ రికార్డు సృష్టించాడు బుచ్చిబాబు.

హీరో ఎవరు

హీరో ఎవరు

ఇక బుచ్చిబాబు రెండో సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనే అంశం మీద చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మొదలు రామ్ చరణ్ అలాగే మరికొందరు హీరోలకు ఆయన కథలు చెప్పాడని ప్రచారం జరిగింది. అయితే అందరికంటే ఎక్కువగా ఎన్టీఆర్ తోనే ఆయన సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు తగ్గట్టు ఎన్టీఆర్ తో తనకు సాన్నిహిత్యం ఉందని కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడంతో ఈ వాదనకు మరింత ఊతం ఇచ్చినట్టు అయింది.

Recommended Video

Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy
మైత్రీ వాళ్ళ చేతిలోనే

మైత్రీ వాళ్ళ చేతిలోనే

అయితే ప్రస్తుతానికి బుచ్చిబాబు తన రెండో సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడని హీరో ఎవరు అనే విషయం పక్కన పెడితే స్క్రిప్ట్ పూర్తి చేశాక ఆ విషయం మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు కూడా రెండో సినిమా ఒక స్టార్ హీరో తో చేయిస్తే ఇంకా ఎక్కువ అ లాభం తమకు లభిస్తుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ దాదాపు అందరు హీరోలతో ఏదో ఒక సినిమా ప్లాన్ చేసింది. మరి ఇప్పుడు బుచ్చిబాబు కోసం ఎవరు ఏ హీరోని రంగంలోకి దింపుతుంది అనేది వేచిచూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X