ఎంతైనా మెగా కాంపౌండ్.. డెబ్యూ హీరోకి అంత బడ్జెటా..?
టాలీవుడ్ హీరోల్లో మెగా ఫ్యామిలీ డామినేషన్ ఉందని కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు దుమ్ములేపుతున్నారు. ఈ వరుసలో చేరేందుకు సుప్రీమ్ హీరో సోదరుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

సుకుమార్ శిష్యుడు..
సుకుమార్ స్క్రిప్టు అందించగా.. శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా మేనల్లుడి ఎంట్రీ మూవీ కావడంతో...మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మైత్రీ మూవీ మేక్సర్స్ -సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో మంతనాలు సాగిస్తూ సినిమా క్వాలిటీ.. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఖర్చు చేస్తున్నారని ప్రచారం. అంతేకాకుండా తమిళ్ నుంచి విజయ్ సేతుపతిని విలన్ పాత్రకు ఒప్పించి బరిలోకి దించి అమాంతం అంచనాలు పెంచేశారు.

మితిమీరుతున్న బడ్జెట్..
అయితే చిత్రీకరణలో స్లోఫేస్ వల్ల మూవీ బడ్జెట్ అంతకంతకు పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువగానే ఖర్చు అవుతోందని సమాచారం. ఒక డెబ్యూ మూవీ అయినా దాదాపు 25 కోట్లు పెడుతున్నట్లు సమాచారం.

షూటింగ్ ఆలస్యం..
సినిమా షూటింగ్ అనుకున్న సమయంలో జరగకపోవడం.. నిరంతరం వాయిదా పడుతూ ఉండటం కూడా బడ్జెట్ మితిమీరి పోవడానికి గల కారణాల్లో ఒకటని తెలుస్తోంది. ఇది ఓ రకంగా భారమవుతోందని అనుకుంటూ విజయ్ సేతుపతి మరో కారణమని తెలుస్తోంది.

విజయ్‌కు భారీ రెమ్యూనరేషన్..
విజయ్ సేతుపతికి భారీగా పారితోషికం ఆఫర్ చేశారని సమాచారం. విజయ్‌కు దాదాపు ఆరు కోట్లు ముట్టజెప్పారని టాక్. అంతేకాకుండా భారీ సెట్లు..టెక్నికల్ టీమ్ ను అదనంగా తీసుకోవడం.. ఇలా మొత్తంగా సినిమా పూర్తయ్యే సరికి తడిచి మోపెడవుతోందని తెలుస్తోంది. మరి డెబ్యూ హీరోకే ఈ రేంజ్‌లో ఖర్చు పెట్టడం వెనకున్న మర్మం ఏంటో చూడాలి.


Click it and Unblock the Notifications











