శంకర్, కమల్ హసన్ సినిమాకు భారీ బడ్జెట్ !

దర్శకుడు ఎస్.శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా మందరికి తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు పార్ట్ 2 రాబోతోందని కొంతకాలం క్రితం చిత్ర దర్శకుడు శంకర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

తమిళ్ టాప్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా తెరకెక్కుబోతోంది. ఈ సినిమా ఇండియన్ 2 టైటిల్ తో రూపొందించబడుతోంది. ప్రస్తుతం రోబో 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న శంకర్ త్వరలో ఇండియన్ 2 సినిమాను ప్రారంభించబోతున్నాడు.

 budget details about shankar and kamal hasan film!

భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లంచం తీసుకునే అవినీతి పరుల పనిపడతారు. మరి సీక్వెల్ లో కథ ఏ విధంగా ఉండబోతోందో చూడాలి. అయితే అప్పట్లో భారతీయుడు చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులు, రివార్డులను కూడా సొంతం చేసుకుంది. అందుచేత ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

భారతీయుడు సినిమాను రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. . మొదటి పార్ట్‌ కంటే ఇంకా ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో నిర్మించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X