twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాపులతో డీలా పడ్డ రౌడీ.. హీరో, లైగర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు

    |

    విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ యూత్ ఐకాన్.. స్టైలింగ్‌కు మారుపేరు.. సెన్సేషనల్ స్టార్ ఇలా ఎన్ని ట్యాగులున్నా సినిమాలు సక్సెస్ కాలేకపోతే అవన్నీ మాయమైపోతాయి. అయితే ఏ హీరోకైనా ఫ్లాపులు, సక్సెలు కామనే అయితే ఒక్కసారి ఉవ్వెత్తున లేచిన కెరటం.. మరుక్షణంలోనే పడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.

    వరుస విజయాలతో ఫామ్‌లోకి..

    వరుస విజయాలతో ఫామ్‌లోకి..

    పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. అంత తక్కువ సమయంలో ఇంతటి పాపులారిటీ వచ్చిన హీరోలు చాలా తక్కువ మంది. కొందరైతే ఏకంగా నైజాం మెగాస్టార్ అని కూడా అనేశారు.

    టాక్సీవాలా చిత్రంతో

    టాక్సీవాలా చిత్రంతో

    ఎన్నో అంచనాల నడుమ వచ్చిన నోటా దెబ్బ తింటే.. తరువాత వచ్చిన టాక్సీవాలా చిత్రం పర్వాలేదనిపించింది. అయితే ఓ ఫ్లాప్ తరువాత ఓ హిట్ రావడంతో అక్కడ లెక్క సరిపోయింది.

    కమర్షియల్‌గా సక్సెస్ సాధించినా

    కమర్షియల్‌గా సక్సెస్ సాధించినా

    దక్షిణాదిపై పట్టును సాధించేందుకు డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ సాధించినా.. విమర్శకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాపుతో విజయ్‌ని డిఫెన్స్‌లో పడేసింది.

    Recommended Video

    World Famous Lover Review And Rating | Filmibeat Telugu
    ప్రాజెక్ట్స్‌లో మార్పులు..

    ప్రాజెక్ట్స్‌లో మార్పులు..

    విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో లైగర్ (ఫైటర్) అనే ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నాడు. మరో వైపు మైత్రీ ఆధ్వర్యంలో చేయబోతోన్న ‘హీరో' సినిమాలోనూ భారీ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ టేకప్ చేసి ప్యాన్ ఇండియా లెవెల్‌లోొ నిర్మించాలని అనుకుంటున్నట్లు టాక్.

    English summary
    Budget Limits For Vijay Devarakonda Upcoming Films Like Liger And Hero. After Back to Back Flops Vijay Graph Falls down. Buzz Is That Makers Wants Movies Within Limited buget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X