బుల్లి రాజు హవా.. బుడ్డోడి రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి హీరోలు, హీరోయిన్ల కంటే చిన్న పాత్రలు చేసే నటులే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టులు తమ అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటి అరుదైన గుర్తింపును అతి తక్కువ సమయంలో సొంతం చేసుకున్న బాలనటుడు రేవంత్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 'బుల్లి రాజు' పాత్రతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు బుడ్డోడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఈ చిన్నోడి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సినిమాలో బుల్లిరాజు పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వెంకటేష్ కుమారుడిగా కనిపించిన రేవంత్ తన సహజ నటన, కామెడీ టైమింగ్, హావభావాలతో అట్రాక్ట్ చేశారు. సినిమాకు అదనపు బలంగా నిలిచాడు. కొన్ని డైలాగ్‌లపై విమర్శలు వచ్చినప్పటికీ, నటుడిగా రేవంత్ ప్రతిభకు మాత్రం ప్రేక్షకులు ఫుల్ మార్కులు ఇచ్చారు. సినిమా విడుదలైన తర్వాత "బుల్లిరాజు" అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారిందంటే .. ఈ బుడ్డోడి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Bulli Raju Revanth Remuneration

'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత మాస్టర్ రేవంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మన శంకరవరప్రసాద్, అనగనగా ఒక రాజు, సింగిల్ వంటి సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దర్శకులు కూడా ప్రత్యేకంగా అతని కోసం కామెడీ ట్రాక్‌లు రాసుకునే స్థాయికి చేరిందంటే అతని క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ లోనూ అతనికి కీలక పాత్ర దక్కినట్లు సమాచారం. ఏ సినిమాలోనైనా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటే ముందుగా రేవంత్ పేరే పరిశీలిస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

రోజుకు లక్ష రూపాయల పారితోషికం?
ఇప్పుడు రేవంత్ గురించి ఇండస్ట్రీలో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం అతని పారితోషికం. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రేవంత్ రోజుకు దాదాపు ఒక లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని చెబుతున్నారు. మరికొన్ని వర్గాల సమాచారం ప్రకారం సినిమా బడ్జెట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి ఒక్కో ప్రాజెక్ట్‌కు 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయల వరకు పారితోషికం అందుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మూవీ మేకర్స్ లేదా రేవంత్ కుటుంబం అధికారికంగా ధృవీకరించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా చానమిల్లి గ్రామానికి చెందిన రేవంత్ ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో అవకాశం అందించారు. ఆ ఒక్క అవకాశం అతని జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు సినిమాలతో పాటు టెలివిజన్ షోలు, మాల్స్ ప్రారంభోత్సవాలు, ప్రకటనల్లోనూ బిజీగా మారిపోయాడు ఈ చిన్నోడు. ఈ చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రేవంత్.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, తెలుగు సినిమా గర్వపడే నటుడిగా ఎదగాలని ఫిల్మీబీట్ తెలుగు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X