హాట్ టాపిక్ : రేట్లు పెంచిన తెలుగు హీరోలు!
'బిజినెస్ మేన్' మూవీ తెలుగు సినిమా రేంజ్ ఏమిటో నిరూపించిన విషయం తెలిసిందే. 80 ఏళ్ల చరిత్రగల తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తూ వసూళ్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సంవత్సరం నుంచి తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతన్న హీరోలు తమతమ రేట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత సంవత్సర ఫలితాలను బట్టి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్, సినిమాలు ఎంత అట్టర్ ప్లాప్ అయినా భారీగా వసూలు చేస్తున్నాయి. అంటే మినిమమ్ గ్యారంటీ అన్నమాట. సినిమా హిట్టయితే లాభాల వరదే. ఇవన్నీ అంచనా వేసిన హీరోలు తమ రేట్లను సైతం పెంచారని చర్చించుకుంటున్నారు.
బిజినెస్ మేన్ బంపర్ హిట్‌తో మహేష్ బాబు ప్రస్తుతం తన రేటను పెంచినట్లు సమాచారం. 95 రోజుల కాల్షీట్, డబ్బింగ్ ఇతర కార్య్రకమాలకు మరో 5 రోజులకు మాత్రమే ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లేట్ అయితే రోజుకు అదనందా కూడా నిర్మాత నుంచి వసూలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లు అర్జున్ కూడా తమ రేట్లను పెంచేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











