మెగా ఛాన్స్ పట్టేసిన సాహో డైరెక్టర్.. చిరంజీవితో స్టెప్! బంపర్ ఆఫర్
ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోంది. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' అంటూ చారిత్రాత్మక సినిమాలో భాగమైన ఆయన, ఆ తర్వాత కొరటాల శివ సెట్స్ మీదకు వచ్చేశారు. చిరు కెరీర్ లో 152వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది.
ఇదిలాఉంటే ఇటీవలే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించనున్నారని సమాచారం. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాకు దర్శకత్వ బాధ్యతలు ఎవరి చేతిలో పెట్టాలని గత కొంతకాలంగా సీరియస్‌గా ఆలోచిస్తున్నారు రామ్ చరణ్.

ఈ మేరకు ఇప్పటికే వీవీ వినాయక్, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు పరిశీలించిన ఆయన.. ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమాను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సుజీత్ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే సుజీత్ మరో మారు సువర్ణావకాశం దక్కించుకున్నట్లే లెక్క. చిరంజీవి లాంటి బడా హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందంటే ఇక సుజీత్ ట్రాక్ రికార్డ్ అలా అలా పైకి వెళుతుందని చెప్పుకోవచ్చు. చూద్దాం మరి చివరికి ఏం జరుగుతుందో!.


Click it and Unblock the Notifications











