పూరీ 'బంపర్ ఆఫర్' కథ ఇదా?

By Srikanya

పూరీ జగన్నాద్ ఎన్నో ఆశలతో తన తమ్ముడు శాయిరామ్ శంకర్ కి లైఫ్ ఇద్దామని తీసిన బంపర్ ఆఫర్ చిత్రం కథ అంటూ ఓ స్టోరీ లైన్ ప్రచారంలోకి వచ్చింది.హీరోయిన్ తండ్రి కోటీశ్వరుడు. హీరో పేద కుర్రాడు. ఆమెను ఇచ్చి పెళ్ళి చేయటానికి ఆయన తన రేంజికి ఎదగమనీ ఛాలెంజ్ చేస్తాడు. అయితే హీరో ఆయన్ని తన రేంజికి దింపుతానని ప్రతిన పూనుతాడు. ఈ రెండు సవాళ్ళు ఎలా నెరవేరాయనేది కథ అంటున్నారు. గతంలో చిరంజివి హీరోగా వచ్చిన ఛాలెంజ్ సినిమా ప్రేరణతో ఈ కథ అల్లారని అంటున్నారు. అయితే ఇవన్నీ రూమర్స్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది నిజమో తేలాలంటే రిలీజయ్యే దాకా ఆగాల్సిందే.ఇక ఈ చిత్రంలో రమణమ్మో పాట ఇప్పటికే పాపులర్ అయింది. ఆవకాయ బిర్యాని హీరోయిన్ బిందు మాదవి అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణగా చెపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X