Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఇద్దరమ్మాయిలతో' లో ఆ ఎపిసోడ్స్ పైనే బన్ని నమ్మకం
హైదరాబాద్ : దేశముదురు తర్వాత బన్నీ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్.లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఫైట్స్ ని ధాయ్ ఫైట్ మాస్టర్ కేచ చాలా స్టైలిషి గా ,ఫ్రెష్ గా కంపోజ్ చేసాడని సమాచారం. ఆఫైట్స్ మీదే బన్నీ పూర్తి నమ్మకం పెట్టుకున్నాడని,ఓ రేంజిలో అవి తన అభిమానులను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు చెప్తున్నారు.
ఈ చిత్రం పై బన్ని అభిమానుల్లోనే కాక మిగతా వారిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ...రిలీజైన ట్రైలర్ ఆదరణ పొందింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్,గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తోంది.
ఈ నెల 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకొన్నారు. చిత్రం విడుదల వాయిదాపడింది. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ....ఈ నెల 31న తెరపైకి తీసుకురాబోతున్నాం. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరాయి. వినోదం, యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమ కథా చిత్రమిది అన్నారు.
కీచా అనే హాంకాంగ్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో చేసిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన గీతాలకు స్పందన బాగుంది. టాప్ లేచిపోద్ది.., వయొలిన్ పాటలు యువతకు అమితంగా నచ్చాయని గణేష్ వివరించారు. ఈ చిత్రానికి సమర్పణ: బండ్ల శివబాబు, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, ఛాయాగ్రహణం: అమోల్ రాథోడ్.