నిజమే...నిర్మించేది అల్లు అరవింద్

By Srikanya

హైదరాబాద్ : కొన్ని సినిమాలు ప్రకటనలు వచ్చేదాకా నమ్మబుద్ది కావు. అలాంటి వాటిల్లో రీసెంట్ గా బోయపాటి, బన్నీ ప్రాజెక్టు ఒకటి. ఓ ప్రక్కన బెల్లంకొండ సురేష్ కొడుకు తో చెయ్యాల్సిన సినిమా పెండింగ్ లో ఉండగా బన్ని తో ప్రాజెక్టు అని టాక్ వచ్చింది. దాంతో అది అంతా కవరేజ్ ఇండియా...బెల్లంకొండ తో చెయ్యాల్సిన ప్రాజెక్టు గురించి అడగకుండా ఈ ప్లే అని తేల్చేసారు. అయితే అటువంటిదేమీ లేదని అది నిజమే అని బన్ని కి చెందిన వారు కూడా అంటూండటంతో నిజమే అనిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించనున్నాడని సమాచారం.

'భద్ర', 'తులసి', 'సింహా', 'లెజెండ్‌'... ఇలా విజయవంతమైన ప్రయాణం చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఆయన యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించే తీరు భిన్నంగా ఉంటుంది. ఈ విషయంలో మాస్‌ ప్రేక్షకులు ఆయనకు మార్కులు ఫుల్‌గా వేసేశారు. అందుకే హీరోలూ బోయపాటితో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడు అల్లుఅర్జున్‌ ఈ దర్శకుడితో జతకట్టబోతున్నారు. బన్నీ - బోయపాటి శ్రీను కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.

ఇటీవల బన్నీకి కథ వినిపించారు బోయపాటి. ఈ కథ నచ్చడంతో బన్నీ పచ్చజెండా వూపేశారు. వచ్చే యేడాది మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తున్నారాయన. ఈ సినిమా పూర్తయ్యాక బోయపాటి చిత్రం మొదలవుతుందన్నమాట. గీతాఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

Bunny,Boyapati movie produced by Allu Aravind

ఇక బోయపాటి,బెల్లంకొండ కొడుకు చిత్రం విషయానికి వస్తే...

'అల్లుడు శీను'గా తెరకు పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్‌ తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆ మేరకు కథను సిద్ధం చేసేశారు బోయపాటి శ్రీను. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ను తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

అందుకోసం శ్రీను ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో సిద్ధం కాగానే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారు. ఆ విషయం గురించి బోయపాటి శ్రీను మీడియాకు తెలియచేసారు.

బోయపాటి మాట్లాడుతూ ''వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు శీను'తో బెల్లంకొండ శ్రీనివాస్‌ మాస్‌ ఇమేజ్‌ సొంతం చేసుకొన్నాడు. ఇప్పుడు నేను చేయబోయే చిత్రం అందుకు ధీటుగా ఉండాలి. అందుకే కథానాయకుడి వేషధారణలో కొత్తదనం ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ మేరకు శ్రీను కసరత్తులు చేస్తున్నాడు'' అన్నారు.

''నా రెండో చిత్రమే బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తుండడం ఆనందంగా ఉంది. ఆయన చెప్పిన కథ చాలా బాగుంది'' అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X