»   » అల్లు అర్జున్ డేట్స్ ..... నాగ బాబు వద్ద కొనుక్కోవాలా?

అల్లు అర్జున్ డేట్స్ ..... నాగ బాబు వద్ద కొనుక్కోవాలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్‌తో 'ఆరెంజ్' సినిమా చేసిన తర్వాత మెగాబ్రదర్ నాగబాబు తీవ్రమైన నష్టాల పాలైన సంగతి తెలిసిందే. తన అంజనా ప్రొడక్షన్స్ బేనర్లో నాగబాబు తీసిన చివరి సినిమా అదే. ఆ సినిమాతో ఆర్థికంగా చితికి పోయిన నాగబాబును... అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నారు.

ప్రస్తుతం నాగబాబు నటుడిగా కొన్ని సినిమాలు, జబర్దస్త్ లాంటి షోలు చేస్తున్నారే తప్ప సినిమాలు తీయడం లేదు. తాజాగా ఆయన మళ్లీ అంజనా ప్రొడక్షన్స్ సంస్థను మళ్లీ నిలబెట్టే ఆలోయనలో ఉన్నాడని, ప్రస్తానికి మెగా హీరోల డేట్స్ బ్లాక్ చేసి వాటిని వాటిని... వారితో సినిమాలు తీయడానికి వచ్చే నిర్మాతలకు అమ్మడం లాంటి బిజినెస్ చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

బన్నీ డేట్స్ నాగబాబు వద్ద కొనుక్కోవాలా?

బన్నీ డేట్స్ నాగబాబు వద్ద కొనుక్కోవాలా?

తాజాగా నాగబాబు చేతిలో బన్నీ డేట్స్ ఉన్నాయని, ఎవరైనా ఆయనతో సినిమా చేయాలనుకుంటే నాగబాబును సంప్రదించి డేట్స్ కొనుక్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా బన్నీకి మంచి రెమ్యూనరేషన్ రావడంతో పాటు, నాగబాబుకు కూడా ఇన్ కం ఉంటుందని టాక్.

గతంలో మహేష్ బాబు కూడా

గతంలో మహేష్ బాబు కూడా

గతంలో తన సోదరుడు రమేష్ బాబును ఆర్థికంగా ఆదుకునేందుకు మహేష్ బాబు కూడా ఇలాగే చేశాడని, ఇపుడు నాగబాబు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మెగా హీరోలు అదే బాటలో నడుస్తున్నారని టాక్.

బన్నీ కొత్త మూవీ విశేషాలు

బన్నీ కొత్త మూవీ విశేషాలు

ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం సినిమా చేస్తున్న అల్లు అర్జున్ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా సినిమా చేయబోతున్నట్లు సమాచారం. నాగబాబు వద్దనే లగడపాటి శ్రీధర్ బన్నీ డేట్స్ కొన్నట్లు టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

డిజే రిలీజ్ వాయిదా?

డిజే రిలీజ్ వాయిదా?

దువ్వాడ జగన్నాధమ్ సమ్మర్ రిలీజ్‌గా మే 19న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్ణయించాడు. కానీ, ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడబోతోందట. అదీ రోజులు కాదు నెలలపాటు. జూన్ 2 న వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. సినిమాను రీ షూట్ చేస్తున్నట్లు టాక్. అఫీషియల్ గా అయితే ఎలాంటి సమాచారం లేదు.

English summary
film Nagar sour said that, Allu Arjun are given his dates to Nagababu for free of cost and he's now selling them to Lagadapati Sridhar for this film, revealed a source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu