»   » హాట్ టాపిక్ :అల్లు అర్జున్ ఓ సీన్ డైరక్ట్ చేసాడు

హాట్ టాపిక్ :అల్లు అర్జున్ ఓ సీన్ డైరక్ట్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bunny
హైదరాబాద్ : అల్లు అర్జున్ ఓ సీన్ ని డైరక్ట్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన కజిన్ సాయి ధరమ్ తేజ తాజా చిత్రం 'రేయ్‌'లో ఓ సన్నివేశం సరదాగా డైరక్ట్ చేసాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరోయిన్ సయామి ఖేర్ ఖరారకు చేసింది. ఓ రోజు బన్ని మా సినిమా 'రేయ్‌' సెట్ కి వచ్చారు. దర్శకుడు వైవియస్ చౌదరి ఓ సీన్ ని డైరక్ట్ చేయమని అడిగారు. అప్పుడు సరదాగా బన్ని డైరక్ట్ చేసారు. చాలా ఫన్ గా గడిచిందా ఆ రోజు అని చెప్పింది.

హే చికీతా.. కుమోస్తాస్‌... అంటూ 'బద్రి' సినిమాలో సందడి చేశాడు పవన్‌కల్యాణ్‌. ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఇప్పుడు అదే తరహాలో పాడుకొంటున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన 'రేయ్‌'లో. వైవీయస్‌ చౌదరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. సాయిధరమ్‌ తేజ్‌ సరసన సయామీఖేర్‌, శ్రద్ధాదాస్‌ హీరోయిన్లుగా నటించారు. చక్రి స్వరాలు సమకూర్చారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఇటీవల హైదరాబాద్‌లో ఆడియో ఫీలర్‌ని విడుదల చేశారు. పదిహేడు సెకన్లపాటు సాగే ఆ ఫీలర్‌లో సాయిధరమ్‌ తేజ్‌ వేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంటోంది. ఆ ఫీలర్‌ 'హే చికితా.. కుమొస్తాస్‌' అంటూ 'బద్రి' సినిమాలో పాట నేపథ్యంతో సాగుతుంది. ఫీలర్‌ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాగబాబు మాట్లాడుతూ ''సాయిధరమ్‌ తేజ్‌ అంటే మా అందరికీ చాలా ఇష్టం. తను ఫైట్లు, డ్యాన్సులు చాలా బాగా చేశాడని విన్నాను. వైవీయస్‌ చౌదరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని పూర్తి చేశాడు. తప్పకుండా అందరికీ మంచి ఫలితాన్నిచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.

చిత్ర దర్శకనిర్మాత వైవీయస్‌ చౌదరి మాట్లాడుతూ ''కొన్ని కారణాలవల్ల సినిమా ఆలస్యమైంది. ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని పూర్తి చేశాం. నమ్మిన సిద్ధాంతం మంచిదైతే... తలపెట్టిన పనులను మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదన్న ఎన్టీఆర్‌ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. జయాపజయాల్ని పట్టించుకోనని పవన్‌ కల్యాణ్‌ అంటుంటారు. ఈ సినిమా విషయంలో ఆయన కూడా నాకు ఆదర్శమే. 'పునాదిరాళ్లు'లో చిరంజీవి గారిని గుర్తుచేసేలా నటించాడు సాయిధరమ్‌ తేజ్‌. తన డ్యాన్సులు, ఫైట్లు అందరినీ ఆకట్టుకుంటాయి. చక్రి వినసొంపైన బాణీలను సమకూర్చాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

చక్రి మాట్లాడుతూ ''చిరంజీవిగారితో కలిసి పనిచేయాలనుకొన్నా. కాన ఆ అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సినిమాకి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. సాయి ధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ ''నాలాంటి ఒక కొత్త కథానాయకుడితో భారీగా వ్యయం చేసి సినిమా చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. వైవీయస్‌ చౌదరికి ఆ ధైర్యం ఉంది కాబట్టే ఈ సినిమాని పూర్తి చేశారు. అవకాశం వస్తే ఆయన దర్శకత్వంలో మరోసారి నటిస్తా'' అన్నారు.

English summary
Sayami Kher happens to be heroine of YVS Chowdary's Rey that features Chiranjeevi's nephew Sai Dharam Tej in the lead. She stated that when Bunny is on set, it is lot of fun. 'One day when Bunny is there on set, YVS garu asked him to direct a scene featuring me. He directed it and it was lot of fun', recollects Sayami Kher.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu