రామ్ చరణ్ చేసిన తప్పును బన్నీ చేయకూడదు...!?
బద్రినాథ్ విడుదల సమీపించే కొద్దీ పబ్లిసిటీ పెంచుతున్నారు కానీ తమకి తెలీకుండానే సినిమాపై రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్నారు అల్లు యూనిట్. ఈ చిత్రంలో తమన్నా ఎంతగా అందాలు ఆరబోసిందనే సంగతి జనం గుర్తించేలా చేయడంపై వారి పబ్బిసిటీ క్యాంపైన్ దృష్టి పెట్టింది. సహజంగా ఒక సినిమా విడుదలయ్యాక, దానికి సరైన వసూళ్లు లేకపోతే హీరోయిన్ ఎక్స్ పోజింగ్ స్టిల్స్ ని చివరి అస్త్రంగా వాడుతుంటారు. కానీ బద్రినాథ్ కి విడుదలకి ముందే వాడుతున్నారంటే దీనికి వారు ఆశిస్తున్న క్రేజ్ రావడం లేదని అర్థం చేసుకోవాల్సివస్తుంది.
కాగా 'మగధీర" లాంటి సంచలనాత్మకమైన విజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలో పాలుపోక రామ్ చరణ్ పరిస్థితి ఎలా వుందో, 'బద్రినాథ్" తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి కూడా అలాగే వుంటుందేమోనని మెగా అభిమానులు ఆందోళన పడుతున్నారు. 'మగధీర స్థాయిలో కాకపోయినా 'బద్రినాథ్" చిత్రం కూడా హిట్ గా నిలబడే అవకాశాలు ఎక్కువే వున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అయితే మగధీర లాంటి పవర్ ఫుల్ రోలో తర్వాత ఓ సున్నితమైన కథాంశంతో సినిమా చేయాలనుకున్నా చరణ్ ఎట్టకేలకు 'ఆరెంజ్" రూపంలో 'బొమ్మరిల్లు" భాస్కర్ చేతికి చిక్కాడు. ఇక ఈ చిత్రం చరణ్ కెరీర్ నే డైలామాలో పడేసింది. ఇక బద్రినాథ్ తర్వాత అర్జున్ కూడా ఆ 'రేంజ్"లో తప్పులో కాలువేయకూడదని, బద్రినాథ్ లాంటి పవర్ ఫుల్ చిత్రం తర్వాత చేయబోయే చిత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు..


Click it and Unblock the Notifications











