జూ ఎన్టీఆర్ ని చూసి నేర్చుకోమని అల్లు అర్జున్ కి ప్రెషర్ ...!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరబ్బా అంటే అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ఇటు ప్రొఫషనల్ గానే కాదు పర్సనల్ లైఫ్ లోనూ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే..అందుకే కాబోలు ఇద్దరూ ఒకేసారి మ్యారేజ్ చేసుకొని లైఫ్ లో సెటిల్ కాబోతున్నారు. ఈ విషయాన్ని అలా ఉంచితే...
పెళ్లై మూడు నెలలైనా ఇంతదాకా అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలు హనీమూన్ జరుపుకోలేదు. కారణం 'బద్రినాథ్" పెండింగ్ పనైనా, జరగాల్సిన ఈ ముచ్చట జరిపించడంలోనూ అల్లు అరవింద్ వ్యాపారానికే ముందు ప్రాముఖ్యతనిచ్చాడు. ఇంకా షూటింగ్ అంటూ తమన్నాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న బన్నికి పాపం ఇప్పట్లో స్నేహా ఉందన్న ద్యాసే లేదు.
ఇదే విషయంలో జూ ఎన్టీఆర్ మాత్రం యమా స్పీడుగా దూసుకెళ్తున్నాడు. పెళ్లై వారం తిరక్కుండానే లక్ష్మీ ప్రణతితో మారిషస్ లో హనీమూన్ ప్లాన్ చేసుకొని హనీమూన్ మదుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్నాడు. బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డిలతో సెట్స్ మీదున్న సినిమాలను పక్కకు నెట్టేసి ప్రణతితో జంప్ జిలాని అయిపోయాడని, ఇటు బన్నీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ బన్నీని హనీమూన్ కెళ్ళమని ఇబ్బందిపెట్టుస్తున్నారంటూ సమాచారం.


Click it and Unblock the Notifications











