రామ్ చరణ్, అల్లు అర్జున్ న్యూ ఇయిర్ స్పాట్..
రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఈ నూతన సంవత్సరం వేడుకలను బ్రెజిల్ దేశంలో జరుపుకున్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు తరుచుగా వీళ్ళిద్దరూ కలిసి అక్కడకి వెళ్ళేవారని,అయితే ఈ మధ్యన రామ్ చరణ్ సైతం పూర్తి స్ధాయి బిజీగా ఉండటంతో కుదరలేదని, అందుకే న్యూ ఇయిర్ స్పాట్ గా ఆ ప్లేస్ ని ఎంపిక చేసుకున్నారని చెప్తున్నారు. ఇక ఈ ప్రదేశం టూరిస్ట్ ఎట్రాక్షన్ గా పేరు పొందిందని ముఖ్యంగా నైట్ లైఫ్ కి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని చెప్తూంటారు.ప్రస్తుతం అల్లు అర్జున్..గుణశేఖర్ తో చేస్తున్న వరుడు, క్రిష్ తో చేస్తున్న వేదం చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ ..బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న ఆరెంజ్ చిత్రం షూటింగ్ హడావిడిలో ఉన్నారు. ఆ ఒక్క రోజు రిలాక్స్ అయి తిరిగి ఎవరు బిజీలో వారు పడిపోయాని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ గుణశేఖర్ బొమ్మరిల్లు క్రిష్ వరుడు ram charan teja allu arjun gunashekar bommarillu krish varudu


Click it and Unblock the Notifications