హాట్ టాపిక్: ‘ఇద్దరమ్మాయిలతో' కథ ఇదా??

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ లో శివ బాబు బండ్ల సమర్పణ లో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున భారీ చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. దేశముదురు తర్వాత అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మరో భారి చిత్రం ఇది. అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్. ఈ చిత్రం కథ అంటూ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో షికారు చేస్తోంది.

ఆ కథేమిటంటే.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రొఫిషనల్ కిల్లర్. అతను కోట్లు ఆస్దికి వారసురాలైన ఒక అమ్మాయిని చంపటానికి డీల్ సెట్ చేసుకుంటాడు. అయితే అక్కడకి వెళ్లాక ఆ అమ్మాయి పరిస్ధితిని, ఆ అమ్మాయి మంచితన్నాని అర్దం చేసుకుని ఆ అమ్మాయిని రక్షించాలని డిసైడ్ అవుతాడు. దాంతో అల్లు అర్జున్ గురంచి అర్దం చేసుకున్న ఆమె బన్నీ తో ప్రేమలో పడుతుంది.

కానీ అప్పటికే బన్నీ మనుస్సులో మరో అమ్మాయి ఉంటుంది. ఆ తర్వాత బన్నీ ఏం చేసాడు..వీరిద్దరిలో ఎవరికి బన్నీ దక్కాడన్నది మిగతా కథ అంటున్నారు. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో వండిన ఉప్మా కథా లేక నిజమేనా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో కామెడీ సీన్స్ బాగా వచ్చాయని చెప్తున్నారు. సింపుల్ స్టోరీని విజువల్ ట్రీట్ లాగ పూరీ తెరకెక్కించాడని చెప్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది. 'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్‌.

నిర్మాత బండ్ల గణేష్‌ మాట్లాడుతూ ''చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది. అల్లు అర్జున్‌ నటన, ఆయన కాస్ట్యూమ్స్‌ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. నెట్‌లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకొంటాయి''అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X