చెర్రీ పెళ్లిలో చిందేయనున్న ఆ.....తారలు ఎవరంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జూన్ 14న పెళ్లి ద్వారా ఏకమవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీ గా ఏర్పాట్లు చేస్తున్నారు మెగా కుటుంబీకులు. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో గ్రాండ్‌గా ఈ వివాహ మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం...పెళ్లికి ముందు జూన్ 11 జరిగే సంగీత్ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్, శ్రియ, తమన్నాలు తమ నృత్యాలతో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అలీ ఖజరారే సాంగుకు స్టెప్పులు వేస్తూ హాస్యాన్ని పండించనున్నారు. ఈ మేరకు వీరు డాన్స్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారట. సాధారణంగా సంగీత్ కార్యక్రమం అనేది ఉత్తరాది సంప్రదాయం. అయితే ఇప్పడు ఈ సాంప్రదాయ దక్షిణాదికి కూడా పాకింది. చెర్రీ పెళ్లితో టాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ పోకడ...ఇక ముందు కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
పెళ్లి నిమిత్తం రామ్ చరణ్ ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పెళ్లికి ముందు రెండు వారాల...పెళ్లి తర్వాత మరో రెండు వారాలు చెర్రీ పూర్తిగా షూటింగులను దూరంగా ఉండి పెళ్లి సంబరంలో మునిగి తేలనున్నాడు. జూన్ 14న వ తేదీన ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వివాహం జరుగనుంది.
మోయినాబాద్‌లోని ఉపాసన కుటుంబీకులకు సంబంధించిన ఫాం హౌస్‌లో పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల బంధుమిత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులకు మాత్రమే ప్రవేశం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఎంట్రన్స్ కార్డులను తయారు చేయించినట్ల తెలుస్తోంది.
అభిమానుల కోసం పెళ్లి తర్వాత రోజు హైదరాబాద్‌లో భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చెర్రీ, ఉపాసనతో పాటు మెగా కుటుంబానికి చెందిన హీరోలంతా హాజరు కానున్నారు. ఇక చెర్రీ, ఉపాసన కుటుంబ సభ్యులు ఈ వేడుక కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











