త్రివిక్రమ్ తీరుపై బన్నీ అసంతృప్తి!
'బ్రదీనాథ్" ప్లాప్ తర్వాత అల్లు అర్జున్....చాలా డిస్సప్పాయింట్ గా ఉన్నాడు. ఎంతో ఆశ పడి చేసిన సినిమా తుస్సుమనడం, పైగా పైళ్లి తర్వాత అదో చేదు అనుభవంగా మిగలడం బన్నీతో పాటు ఫ్యాన్స్ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో ఈ సారి ప్రయోగాల జోలికి పోకుండా ప్రేక్షకులను మెప్పించే మంచి ఎంటర్ టైన్మెంట్ సినిమాతో రావాలని ఆవిస్తున్నాడు. ఇందు కోసం అలు అరవింద్ అండ్ కో... దర్శకుడు త్రివిక్రమ్ ఎంపిక చేశారు. దీంతో ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో ఉన్నాడు.
అయితే...బన్నీ త్రివిక్రమ్ తీరుపై కాస్త కోపంగా ఉన్నాడట. బ్రదీనాథ్ విడుదలై రెండు నెలలైనా తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ ఇంకా మొదలు పెట్టక పోవడమే ఇందుకు కారణం. త్రివిక్రమ్ కు టైమ్ సెన్సు లేదని చిటపటలాడుతున్నాడట. ఆయన స్క్రిప్టు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ లోగా సమయం వేస్టు చేయకుండా బుజం సర్జరీ కోసం ఆస్ట్రేలియా చెక్కేశాడు.
త్రివిక్రమ్ కు ఇప్పటికే చాలా లేటు దర్శకుడు అనే పేరుంది. ఇంతకు ముందు మహేష్ బాబుతో సినిమాను పూర్తి చేయడానికి 3 ఏళ్ల సమయం తీసుకున్నాడు. ఆలస్యం అమృతం విషం అన్న చందంగా 'ఖలేజా" సినిమా బొక్కబోర్లా పడింది.


Click it and Unblock the Notifications











