సునీల్ దర్శకుడుతో అల్లు అర్జున్ చిత్రం??

By Srikanya

హైదరాబాద్ వరస ప్లాపుల్లో ఉన్న సునీల్ కి పూల రంగడు చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు వీరభద్రమ్. వీరభద్రమ్ త్వరలో అల్లు అర్జున్ తో చిత్రం చేయబోతున్నాడని,ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని వినికిడి. డివివి దానయ్య నిర్మాతగా ఈ చిత్రం నిర్మించే అవకాసం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఈ విషయమై దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడటానికి ఆసక్తి చూపించటం లేదు.

ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం నా దృష్టి అంతా నాగార్జునతో చేయబోయే భాయ్ చిత్రంపైనే ఉంది. అల్లు అర్జున్ తో చిత్రం ఇప్పటివరకూ ఏమీ ఖరారు కాలేదు అన్నారు. ఇక అల్లు అర్జున్ కి పూర్తి స్ధాయి మాస్ కామెడీ కథను వినిపించినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ కొన్ని మార్పులు చెప్పాడని,స్క్రిప్టు పూర్తి స్దాయిలో ఓకే అయ్యాక ఈ చిత్రంపై దర్శక, నిర్మాతలు ప్రకటన చేసే అవకాసం ఉందని వినికిడి.

ఇక భాయ్ చిత్రాన్ని వీరభద్ర చౌదరి డైరక్ట్ చేయనున్నారు. అహనా పెళ్లంట,పూల రంగడు చిత్రాలతో కామీడి చిత్రాలు తీసి హిట్ కొట్టగలడనే పేరు తెచ్చుకున్న వీరభద్రం ఈ చిత్రంతో హాట్రిక్ హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు. మొదట ఈ చిత్రాన్ని అధినాయకుడు తీసిన ఎమ్.ఎల్ కుమార్ చౌదరి తీస్తాడని అనుకున్నారు. అయితే అధినాయుకుడు చిత్రంతో పూర్తిగా ఫైనాన్సియల్స్ ట్రబుల్స్ లో మునిగిపోయిన చౌదరితో కష్టమని నాగార్జునే స్వయంగా తన బ్యానర్ పై ఈ ప్రాజెక్టు చేస్తున్నట్లు సమాచారం.

మరో ప్రక్క అల్లు అర్జున్ ఇప్పటికే రెండు చిత్రాలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నారు. మొదటిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇద్దరు అమ్మాయిలుతో చిత్రం ప్రారంభం కానుంది. తాప్సీ,అమలా పౌల్ ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం అనంతంరం సురేంద్ర రెడ్డి దర్సకత్వంలో చిత్రం కమిటయ్యారు. ఈ రెండు చిత్రాలు తర్వాత వీరభద్రం చిత్రం ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X