'బిజినెస్ మ్యాన్' పేరడీ ఆ సినిమాలో...
ఓ సినిమా సూపర్ హిట్టైందంటే దానికి సంభందించిన పేరడీని దించేయటంలో మన తెలుగు వాళ్లు దిట్టలు. గతంలో ఎన్నో పేరడీలు చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ పేరడీకి శ్రీకారం చుట్టారు. ఆయన తాజా చిత్రం సకల కళా వల్లభుడు(కన్ఫర్మ్ కాని టైటిల్)లో ఈ ప్యారెడీని పెట్టారని సమాచారం. సినిమాలో ఈ సీన్స్ హైలెట్ అవుతాయని,ఇందుకోసం డైలాగులు రచయిత చింతపల్లి రమణ ప్రత్యేకమైన పంచ్ లతో రాసారని తెలుస్తోంది. ముఖ్యంగా ఉచ్చ డైలాగుని ప్యారెడీ చేసారని,దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఈ రకమైన విన్యాసాలు చేయనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఓ పాపులర్ స్టార్ హీరోయిన్ అల్లరి నరేష్ సరసన చేయనుంది.
తమిళంలో సూపర్ హిట్టైన తమిళ పదం చిత్రం రీమేక్ గా ఈ చిత్రం రూపొందనుంది. మరో ప్రక్క అల్లరి నరేష్ నారాయణ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో నువ్వా నేనా అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. దీవానా మస్తానా రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. శర్వానంద్,శ్రియ మరో పాత్రలో చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోంది. మరోప్రక్క ఈ చిత్రం తర్వాత ఎకె ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించే త్రీడి చిత్రం లోనూ కమిటయ్యాడు. ఈ చిత్రంలో నరేష్ తో పాటు మరో నలుగురు హీరోలు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











