ప్చ్...పూరీ జగన్నాథ్ పూనుకున్నా ఫలితం శూన్యం

By Srikanya

హైదరాబాద్ : పూరీ జగన్నాథ్, వివి వినాయిక్, రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్స్ కి ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారు తమ వారి చిన్న చిత్రాలకు ప్రమోషన్ చేపడితే, క్రేజ్ క్రియేట్ అయ్యి బిజినెస్ అవుతూంటాయి. అయితే ఒక్కోసారి ఆ మ్యాజిక్ కూడా వర్కవుట్ కాదు. పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరామ్ శంకర్ నటించిన 'రోమియో' చిత్రం లేపి నిలబెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చిత్రానికి కథ,మాటలు అందించారు. అయినా ట్రేడ్ వర్గాల్లో ఏమీ కదలిక లేదని సమాచారం.

దీనికి కారణం సాయిరామ్ శంకర్ చిత్రాలు వరసగా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటమేనని విశ్లేషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ తను డైరక్ట్ చేసే చిత్రానికే వక్కంతం వంశీ కథ తీసుకుంటూంటే ఇంక ఆయన కథ,మాటలు అందించిన చిత్రంకి ప్రత్యేకమైన విలువ ఎక్కడ ఉంటుందనే విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం ఆడియో సైతం భారీగా విడుదల చేసారు. రవితేజ ను గెస్ట్ పాత్రలో ట్రైలర్ విడుదల చేసారు. కానీ ఫలితం కనపడటం లేదు అంటున్నారు.

Business problem to Romeo film?

సాయిరామ్‌శంకర్‌, అడోనిక హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'రోమియో'. గోపీ గణేష్‌ దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్‌ కథ, మాటలు అందించారు. టచ్‌స్టోన్‌ దొరైస్వామి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమికులు అంటే గుర్తొచ్చే జంటల్లో రోమియో జూలియట్‌ జంట ఒకటి. ఈ సినిమాలో మా నాయకానాయికల మధ్య ఆ స్థాయిలో ప్రేమ ఉంటుంది. సినిమా అయ్యాక బయటకొచ్చేవారి మనసులో చక్కటి భావనను కలిగించే చిత్రమిది'' అన్నారు.

''సాయిరామ్‌శంకర్‌ నటన, అడోనిక అందచందాలు సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము''అన్నారు నిర్మాత. చిత్రంలో జయసుధ, నాగబాబు, అలీ, సుబ్బరాజు, ప్రగతి తదితరులు నటించారు. సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఛాయాగ్రహణం: పి.జి.విందా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X