‘బిజినెస్ మేన్’కు A సర్టిఫికెట్?
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'బిజినెస్ మేన్' సినిమా జనవరి 11న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ రోజే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం 'బిజినెస్ మేన్' సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించడానికి దర్శక, నిర్మాతలు నో చెప్పుడంతో మైనర్ కటింగ్స్ తో ఈ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేస్తోంది. ముంబై మాఫియా నేపథ్యం, ఆయుధాల వ్యాపారం స్టోరీలైన్ తో సాగే ఈ సినిమాను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. గతంలో పూరి, మహేష్ కాంబినేషన్లో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో...ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











