ఓపెనింగ్ రికార్డుపై కన్నేసిన బిజినెస్ మేన్
మహేష్ బాబు గత సినిమా 'దూకుడు' పాత రికార్డులను బద్దలు కొడుతుందనే రేంజ్ లో వెళ్లినా...జస్ట్ లో మిస్సయింది. ఇండస్ట్రీ ఆల్ టైమ్ టాప్ 2 హిట్ గా నిలిచింది. అయితే బిజినెస్ మేన్ సినిమా దూకుడును క్రాస్ చేసి అన్ని రికార్డులను బద్దలు కొడుతుందో? లేదో? తెలియదుకానీ....ఒక్క విషయం మాత్రం స్పష్టం అవుతోంది. ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా బిజినెస్ మేన్ సినిమా హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా తొలిరోజు దాదాపు 2వేల స్ర్కీన్లలో రిలీజ్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు జూ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' చిత్రం పేరు మీద ఉంది. మరి బిజినెస్ మేన్ ఊసరవెల్లిని అధిగమిస్తుందా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది. రేపు సాయంత్రంలోగా ఓపెనింగ్ కలెక్షన్ల లెక్కలు తేలనున్నాయి.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు-కాజల్ జంటగా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పూరి దర్శకత్వానికి, అతను రాసిన డైలాగులకు ఇప్పటికే మంచి మార్కలు పడ్డాయి. ఇక మహేష్ బాబు యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కాజల్ అందం, గ్లామర్ సరేసరి. ఇవన్నీ కలిపి బిజినెస్ మేన్ సినిమా హిట్టవ్వడానికి సంకేతాలు అంటున్నారు అభిమానులు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











