బిజినెస్ పెంచేందుకు మహేష్-కాజల్ లిప్ లాక్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి 'బిజినెస్ మేన్'గా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తన సినిమా బిజినెస్ రేంజ్ చూపించి టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టి నెం.1 స్థానాన్ని దక్కించుకోవాలనే కసితో ఉన్నాడు మహేష్ బాబు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య సుధీర్ఘమైన లిప్ లాక్ సీన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బిజినెస్ పెంచడంలో భాగంగా పూరి జగన్నాథ్ మహేష్ బాబును ముద్దు సీన్ కోసం ఒప్పించారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో సినిమా విడుదలైతే గానీ తెలీదు.
కాజల్ కు ముద్దు సీన్లలో ఇప్పటికే మంచి అనుభవం ఉంది. చందమామ, ఆర్య2 చిత్రాల్లో అమ్ముడు ముద్దు సీన్లను ఎంతో ఇష్టంగా పండించింది. అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు తెరపై ఇలాంటి ఫీట్లు చేయలేదు. ఆ మధ్య నాని చిత్రంలో అమీషా లిప్సను తన లిప్స్ తో టచ్చ్ చేస్తూ ఓ ఫోటోకు మాత్రం ఫోజిచ్చాడంతే.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'బిజినెస్ మేన్' సినిమా ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో సాగుతుంది. ఆర్ ఆర్ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











