లాభాలు లేవా..? మహేష్ ‘బిజినెస్‌మేన్’ సీక్రెట్స్!
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'బిజినెస్ మేన్' చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వారంలో ఈచిత్రానికి వచ్చిన కలెక్షన్లుచూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈచిత్రం టాలీవుడ్ నెం.1 కాదని తేలి పోయింది. అయితే నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చి పెట్టిందనే టాక్ తెచ్చుకుంది.
అయితే తాజాగా ఈచిత్రం గురించి ఓ టాక్ బయటకు వచ్చింది. ఈచిత్రం ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థకు నష్టాలను మిగిల్చిందని, కావాలనే ఈ విషయాన్ని నిర్మాతలు బయట పెట్టడం లేదనే పుకార్లు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ కారణంగానే 'ఆర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్' వారు తమ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులను మూసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈచిత్రం తొలి వారం విపరీతమైన కలెక్షన్లతో టాలీవుడ్ బెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. అయితే రెండో వారం నుంచి ఆశించిన రేంజిలో వసూళ్లు రాలేదని, పైగా హీరో మహేష్ బాబుకు, దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇచ్చిన భారీ రెమ్యూనరేషన్‌కు తోడు...మహేష్ బాబు అక్క మంజుల కూడా తనకు రావాల్సిన మొత్తాన్ని తీసుకోవడం వెరసి చివరకు ఆ సంస్థకు కొద్ది పాటి నష్టాలనే మిగిల్చాయని అంటున్నారు.
ఆ తర్వాత ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మించిన 'పూల రంగడు' లాభాలను తేవడంతో సంస్థ కు కాస్త ఊరట లభించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని మెయిన్‌టెన్ చేయడం ఇష్టం లేక తమ డిస్ట్రిబ్యూషన్ సంస్థలను మూసి వేశారని అంటున్నారు. మరి ఫిల్మ్ నగర్లో జరుగుతున్న ఈ ప్రచారంపై ఆర్ ఆర్ మూవీమేకర్స్ సంస్థ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ సంస్థ నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'పైసా', నాగ చైతన్య హీరోగా దేవాకట్ట దర్శకత్వంలో 'ఆటో నగర్ సూర్య' చిత్రాలు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











