కప్పేలా రీమేక్ కోసం అల్లు అర్జున్ టైటిల్.. న్యూ మల్టీస్టారర్!
మళయాళం ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్న కప్పేలా సినిమా దేశవ్యాప్తంగా డిజిటల్ వరల్డ్ లో మంచి గుర్తింపు అందుకుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కిన ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఇతర ఇండస్ట్రీలోని నటీనటులు పోటీ పడుతున్నారు. ఇక తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ రైట్స్ ను దక్కించుకుంది.
అయితే ఈ సినిమాలో ఇద్దరు యువ హీరోలు నటించబోతున్నారు. నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా కోసం అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ ను అనుకున్నట్లు సమాచారం. అల.. వైకుంఠపురములోని బుట్టబొమ్మ పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు కప్పేలా రీమేక్ సినిమా కోసం బుట్టబొమ్మ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక అతిముఖ్యమైన హీరోయిన్ పాత్ర కోసం అజిత్ విశ్వాసం ఫేమ్ అంకిత సురేంద్రన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. ఇక సినిమాను ఎలాగైనా వచ్చే ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత నగవంశీ ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











