twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బయ్యర్లు నెత్తినోరూ బాధుకొంటున్నా జూ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదా...?

    By Sindhu
    |

    చాన్నాళ్ళ క్రితం భారీ అంచనాలతో తెరకెక్కిన 'ఆంధ్రావాలా" సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా దెబ్బకి, బయ్యర్లు బెంబేలెత్తిపోతే ఇంకో సినిమా తక్కువ రేటుకే అందిస్తానన్న జూ ఎన్టీఆర్ అప్పట్లో 'నా అల్లుడు" సినిమాని అదే బయ్యర్ల నెత్తిన బండరాయిలా పడేశాడు. మళ్ళీ ఇప్పుడు 'శక్తి" సినిమా విషయంలోనూ బయ్యర్లు జూ ఎన్టీఆర్ కాళ్ళా వేళ్ళా పడ్తోంటే, ఇంకో సినిమా తక్కువ రేటుకి ఇప్పిస్తాన్లే..అని సర్థి చెబుతున్నాడట. దాంతో బయ్యర్లు'వద్దుబాబోయ్.."అని భయపడిపోతున్నారట గత అనుభవాల నేపథ్యంలో

    మొదట బయ్యర్లు నిర్మాత అశ్వనీదత్ వెంట పడితే, 'నేనే నెత్తిన తడిగుడ్డవేసుకొన్నా"అనే సమాధానం వచ్చిందనీ, దాంతో బాధిత బయ్యర్లంతా జూ వెంటపడ్డారనీ, వారికి జూ ఎన్టీఆర్ 'తర్వాతి సినిమా తగ్గిస్తాన్లే.."అని చెప్పాడనీ టాలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మా నెత్తిన ఇంకో పిడుగా..?అలాంటిదేమీ వద్దుగానీ ఆర్థకంగా ఆదుకోమని 'శక్తి" బయ్యర్లు జూ ఎన్టీఆర్ ని వేడుకుంటున్నారట. బయ్యర్లను ఆదుకోవడానికి మన టాలీవుడ్ హీరోలేమీ, రజనీకాంత్ అంతటి విశాల హృదయులు కారుగా..

    English summary
    Shakti' film Buyers are facing huge losses due to film registering disastrous talk at Box-Office. All the Buyers together went to Producer requesting him to given them some money to balance their losses. But Ashwini Dutt is least bothered about their request it seems. So buyers have decided to meet Ntr and request him. Let us wait and see will Ntr show them any solution or not.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X