Kalki Vs Vishwambhara: కల్కిని తలదన్నేలా విశ్వంభర.. మెగాస్టార్ మాస్ ప్లానింగ్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న నిరంతర స్వయం కృషీవలుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పుకోవాలి. ఇప్పుడు 7 పదుల వయసులో కూడా ఉన్నా కూడా రిస్కీ స్టంట్లు చేస్తూ సినిమా కోసం ఎంతో కష్టపడుతూ అభిమానులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా రీఎంట్రీ తర్వాత చిరు నుంచి పలు రీమేక్ సినిమాలు చేశారు కానీ అవి అంతగా వర్క్ అవ్వలేదు ఆ మూమెంట్ లో స్ట్రైట్ సినిమా "వాల్తేరు వీరయ్య" తో భారీ వసూళ్లు అందుకొని చిరు తన బాక్సాఫీస్ స్టామినా ప్రస్తుత తరానికి చూపించారు. ఇక దీని తర్వాత వచ్చిన రీమేక్ సినిమా భోళా శంకర్ భారీ డిజాస్టర్ అయ్యింది.

దీనితో చిరు అసలు రీమేక్ లు చేయొద్దని ఫాన్స్ కోరుకుంటున్న సమయంలో స్ట్రైట్ సినిమాతో చిరు భారీ అనౌన్సమెంట్ అందించారు. అది కూడా ఈ సినిమాని ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ ఉన్న యువ దర్శకుడు వశిష్ఠకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కాగా ఈ సినిమా కూడా చిరు కెరీర్ లో బాగా కలిసొచ్చిన సోసియో ఫాంటరీ జానర్ లో ఉంటుంది అని ఇప్పటికే ఖరారు అయ్యింది.
దీనితో మళ్ళీ తాము అంజి, జగదేక వీరుడు రోజులు లోకి వెళ్ళబోతున్నామని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా జానర్ పై మరో ఫ్రెష్ రూమర్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా ఫాంటసీ కం సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది అని వినిపిస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా రెండు అంశాలని మేకర్స్ మిక్స్ చేశారు అంటూ కొన్ని గాసిప్పులు ఈ మెగా సినిమా విషయంలో ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇలా కొంచెం లాజికల్ కూడా యంగ్ దర్శకుడు మెగాస్టార్ ని ప్రెజెంట్ చేయబోతున్నాడు అని ప్రస్తుతానికి ఉన్న టాక్. మరి ఇదెంత వరకు నిజమో చూడాలి. కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన చాలా ఏళ్ల తర్వాత మరోసారి త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకి ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు చిరంజీవి కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీనిని నిర్మాణం వహిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం సంక్రాతి కానుకగా మేకర్స్ రిలీజ్ ఆల్రెడీ డేట్ ని ఫిక్స్ చేసేసారు. దీనితో మరోసారి చిరుకి సంక్రాంతి బరి వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ సంక్రాంతిగా నిలిచిపోవాలి అని ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











