బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్? కొరటాల ప్లానింగ్ అదిరిపోయిందిగా!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కుర్రాళ్లని మించి వేగంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చూస్తున్న ఆయన దీనికి సమాంతరంగా మరో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఒకటి దసరాకి, మరొకటి సంక్రాంతికి విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మూవీకి నట సింహం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. బాలయ్యతో మూవీ కోసం కొరటాల శివ భారీ స్టార్ క్యాస్టింగ్‌ని సెట్ చేసే పనిలో ఉన్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

నిజానికి జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర 2 సినిమాను తెరకెక్కించాలని కొరటాల శివ రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అప్పటి దాకా ఖాళీగా కూర్చోవడం దేనికని భావించిన కొరటాల.. తన దగ్గరున్న పవర్‌ఫుల్ కథల్లో ఒకదానిని బయటకు తీసి బాలయ్యను కలిశారు. ఈ స్టోరీని విన్న బాలయ్య మరో మాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అలా ఎవ్వరూ ఊహించని విధంగా బాలకృష్ణ- కొరటాల శివ క్రేజీ కాంబోకి శ్రీకారం జరిగింది.

Buzz Grows Around Nandamuri Balakrishna Koratala Siva Film with Vidya Balan and Sanjay Dutt

మాస్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన బాలయ్యనిస్టైలీష్ మేకింగ్‌తో సామాజిక సందేశాన్ని ఇచ్చే కొరటాల ఎలా చూపిస్తారోనని అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథకు సంబంధించి అప్పుడే గాసిప్స్ మొదలైపోయాయి. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రిగా కనిపిస్తారని కొందరు... కాదు కాదని మరికొందరు అంటున్నారు. ప్రధానంగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పొలిటికల్ టచ్ ఉన్న మూవీగా కొరటాల ఈ కథను సిద్ధం చేశారట.

ప్రముఖ నిర్మాతలు చెరుకూరి సుధాకర్, సుధాకర్ మిక్కిలినేనిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆగస్ట్‌లో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుందని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే 2027 సమ్మర్ కానుకగా కొరటాల - బాలయ్య సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే కొరటాల మూవీ సెట్‌లో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలాఉండగా.. బాలయ్యతో మూవీ కోసం భారీ స్టార్ క్యాస్టింగ్‌ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు కొరటాల శివ. సోషల్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్స్‌ను బట్టి ఈ సినిమా కోసం బాలీవుడ్ అగ్రనటి విద్యాబాలన్.. బాలయ్యకు హీరోయిన్‌గా నటించనున్నారట. అలాగే మరో అగ్రనటుడు సంజయ్ దత్.. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. బాలయ్యతో గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో హీరోయిన్‌గా నటించారు విద్యాబాలన్. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ ఆమె నటించలేదు.

ఒకవేళ కొరటాల- బాలయ్య మూవీలో నటించేందుకు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యాబాలన్ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చినట్లే. అటు సంజయ్ దత్ కూడా అఖండలో కీలకపాత్ర పోషిస్తారని వార్తలు రాగా.. చివరికి గాలివార్తలుగానే మిగిలిపోయాయి. ఒకవేళ సంజయ్ దత్, విద్యాబాలన్ కానుక ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెబితే.. బాలయ్య - కొరటాల మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X