కాజల్‌కు పెళ్లి కళ వచ్చేసింది.. కాబోయే వరుడి వివరాలివే!!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి పీఠలెక్కే సమయం ఆసన్నమైంది. మీడియా ఎప్పుడు ఎవరికి ఎలా పెళ్లి చేస్తుందో చెప్పలేం. సెలెబ్రిటీల పెళ్లిళ్లపై నిత్యం రూమర్లు, పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి. అయితే అందులో అన్నీ రూమర్లే కాకపోవచ్చు. కొన్నైనా నిజాలు ఉంటాయి. నిజాలు లేనిదే పదే పదే వార్తలు బయటకు రావు. అదే క్రమంలో కాజల్ అగర్వాల్ పెళ్లి వార్తలు కూడా ప్రస్తుతం దావానంలా వ్యాప్తి చెందుతున్నాయి.

Recommended Video

Tollywood Actress Kajal Aggarwal To Marry Mumbai Businessman Gautam Kitchlu
లాక్ డౌన్‌లో అలా..

లాక్ డౌన్‌లో అలా..

లాక్ డౌన్‌లో కాజల్‌కు సంబంధించిన కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కాజల్‌కు నిశ్చితార్థం కూడా అయిపోయిదంటూ వార్తలు హల్చల్ చేశాయి. కాజల్ ముద్దుగుమ్మపై ఇలాంటి వార్తలు రావడం ఇదేమీ కొత్తకాదు. కానీ ప్రస్తుతం ఈ వార్తలు మరింతగా పుట్టుకొస్తున్నాయి.

అతనే వరుడు..

అతనే వరుడు..

తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతోందట. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందట. అయితే లాక్ డౌన్ ఎత్తేశాక జరిగే మొదటి గ్రాండ్ ఈవెంట్ ఇదేనని వార్తలు వైరల్ అవుతున్నాయి.

వరుడి వివరాలు...

వరుడి వివరాలు...

కాజల్‌ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అట. గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నాడని, డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని ఓ చిట్టా కూడా వైరల్ అవుతోంది. డిసెర్న్ లివింగ్ మొదలు పెట్టక ముందు, ఫ్యాబ్ ఫర్నిష్ కి వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే లైఫ్ స్టైల్ బ్రాండ్ - ద ఎలిఫెంట్ కంపెనీ కి సీఈఓ గా ఉన్నారట.

ఎలా స్పందిస్తుందో..

ఎలా స్పందిస్తుందో..

అయితే పెళ్లి వార్తలు ఇంతగా వైరల్ అవుతుంటే కాజల్ మాత్రం సైలెంట్‌గానే ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాజల్.. ఇలాంటి విషయాల్లో సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనేమో అని అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా కాజల్ స్పందించే వరకు వీటిలో నిజమెంత ఉందో చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X