జార్జ్ రెడ్డి కోసం కదిలి రానున్న పవన్ కళ్యాణ్

ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'జార్జ్ రెడ్డి'. ఈమధ్యే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జార్జ్ రెడ్డి 25 ఏళ్ల వయసులోనే ప్రత్యర్థుల దాడిలో మరణించాడు. హైదరాబాద్ చేగువేరాగా ప్రసిద్ది చెందిన ఆయన జీవితగాథ వెండితెరపై ఆవిష్కరిచంనున్నారు.

అపారమైన మేధస్సుతో పాటు ధైర్యం, పోరాడే తత్వం కలిగిన ఈయనంటే పవన్ కళ్యాణ్ కు కూడా చాలా అభిమానం. ఈ విషయాన్ని ఎన్నో వేదికలపై అందరితో పంచుకున్నాడు. అందుకే 'జార్జ్ రెడ్డి' ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని టాక్. నవంబర్ 17న జరిగే ఈ వేడుకకు పవన్ విచ్చేస్తే.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది.

Buzz Is That Pawan Kalyan May Attend George Reddy pre Relaese Event

అసలే సినీ ఫంక్షన్లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్.. సెలెక్టివ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుంటాడు. అలా ఈ ఈవెంట్‌కు పవన్ వస్తే.. మూవీకి ఓ రేంజ్‌లో పాపులార్టీ వచ్చేస్తుంది. జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైక్‌ మూవీస్‌ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'వంగవీటి' ఫేం సందీప్‌ మాధవ్‌ (సాండి) ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదలకానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X